ఆంధ్రప్రదేశ్‌

ఆర్థికలోటులోనూ సంపద సృష్టించిన ఘనత బాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 19: రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌కు 97 వేల కోట్ల రూపాయలుగా ఉన్న అప్పును ఐదేళ్లలో రూ. 2.58 లక్షల కోట్లకు పెంచి రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని వైసీపీ నేతలు, మంత్రులు పదే పదే అవాస్తవాలు చెప్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి మండిపడ్డారు. అదేపనిగా చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గాను శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు వాల్యూం -జి1లో రాష్ట్ర ప్రారంభ అప్పులు ఎంత అనే వివరాలు స్పష్టంగా చూపించారన్నారు. బడ్జెట్ పత్రాల ప్రకారం విభజన నాటికి ఏపి ప్రారంభ అప్పు 1.48 లక్షల కోట్లు అనేది స్పష్టంగా ఉందన్నారు. రూ.97 వేల కోట్లు అనేది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇప్పటికీ విభజితం కాకుండా మిగిలిఉన్న ఉమ్మడి అప్పు కూడా ఏపీ ప్రభుత్వ ఖాతాలోనే ఉందని, దీనికి వడ్డీలు కూడా ఏపీనే చెల్లిస్తోందని వివరించారు. విభజితం కాని అప్పుతో సహా విభజన నాటికి ఏపీకి వారసత్వంగా నెత్తినపడ్డ అప్పు రూ.1.48 లక్షల కోట్లు అనేది బడ్జెట్ పత్రాలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా చూస్తే ఈ ఐదేళ్లలో ఉన్న అప్పుపై కొత్తగా చేసిన అప్పు 75 శాతంగా మాత్రమే ఉందని తెలిపారు. 2004 నాటికి వైఎస్‌ఆర్ పరిపాలన ప్రారంభమయ్యే సమయంలో ఏపీ అప్పు రూ. 58 వేల కోట్లు కాగా, 2009-10 నాటికి రూ.1.09 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఉన్న అప్పుపై వైఎస్ 86 శాతం పెంచారని వివరించారు. రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్‌తో ఏర్పాటైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న అప్పులపై 75 శాతం పెంచగా, మిగులు బడ్జెట్ ఉన్న వైఎస్ 86 శాతం పెంచారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రంలో సంపద సృష్టించిందన్నారు. రూ.1600 కోట్లతో పట్టిసీమను పూర్తిచేసి 4 పంటకాలాల్లో రూ.44 వేల కోట్ల విలువైన పంట దిగుబడులు సాధించిందని పేర్కొన్నారు. వైఎస్ పాలనలో చేసిన అప్పుల వలన జలయజ్ఞం ద్వారా నిరర్థక ఆస్తులు సృష్టించారని ఆరోపించారు. ఇక తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే మిగులు బడ్జెట్ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఉన్న అప్పులపై గడిచిన ఐదేళ్లలో 100 శాతానికి పైగా పెంచారని అన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లలో రూ.33 లక్షల కోట్ల కొత్త అప్పులు చేసిందని, ఏ రకంగా చూసినా చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు చాలా తక్కువని పేర్కొన్నారు. అబద్దపు ప్రచారాలు మానుకుని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని మాల్యాద్రి హితవుపలికారు.