ఆంధ్రప్రదేశ్‌

తమిళనాడుకు చేరిన రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 20: గత కొన్నిరోజులుగా ఎదురుచూస్తున్న నైరుతి రుతు పవనాలు రానేవచ్చాయి. వేసవి ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు ఈ వార్తతో ఊరట చెందుతున్నారు. తమిళనాడు ప్రాంతంలోని కడలూరుకు నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం గురువారం రాత్రి పేర్కొంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఇవి ఏపీకి చేరుకుంటాయని కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒకటి,రెండు చోట్ల వర్షాలు పడతాయని కేంద్రం వివరించింది. కర్ణాటకలో మంగళూరుకు నైరుతి రుతు పవనాలు చేరుకుంటున్నాయని, ఇదే తరహాలో మరోపక్క పశ్చిమబెంగాల్‌లో కోల్‌కత్తాకు సమీపిస్తున్నట్టు ఈ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో వాతావరణం చల్లబడనుందని కేంద్రం తెలిపింది.