Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామనావతార ఘట్టం
వచనం: వారాదినమున చాలా దూరం పయనించి, సిద్ధాశ్రమాన్ని చేరుకున్నారు. అది తరులతాదులతో, మృగాలతో, పక్షులతో రమణీయంగా ఉంది. దాని అంద చందాలకు ముగ్ధులైపోయారు రామలక్ష్మణులు.
‘‘ఈ ఆశ్రమమెవరిది? ఇక్కడెవరుంటారు?’’అంటూ ప్రశ్నించారు వారు. అప్పుడా విశ్వామిత్ర మహర్షి దాని కథనిలా వివరించాడు.
‘‘దీనిని ‘సిద్ధాశ్రమ’మని అంటారు. పూర్వం విష్ణువిక్కడ సుదీర్ఘమైన తపస్సుచేసి, సిద్ధినందాడు. అందుకే దీనికాపేరు. తరువాత కొంత కాలానికి విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి సుదీర్ఘమైన తపము చేసి, అనంత శక్తిసంపన్నుడై, ఇంద్రాది దేవతలను జయించి, త్రిలోకాధిపత్యాన్ని సంపాదించి, అజేయుడై పరిపాలన చేయసాగాడు. అప్పుడు వనాలపాలైన దేవతలంతా విష్ణువును శరణుజొచ్చి, ఏ విధంగానైనా బలినుండి తమ తమ రాజ్యాలను సంపాదించి, తిరిగి తమకప్పగించమని దీనాతిదీనంగా వేడుకున్నారు. అప్పుడు విష్ణువు ‘‘అలాగే’’నని వారికభయమిచ్చి, ఆ కార్యసాధనకై అదితి కశ్యపులకు తాను ‘‘వామనుని’’గా జన్మించాడు. ఆపై తగిన సమయంకోసం వేచిచూడసాగాడు. కొంతకాలం తర్వాత బలిచక్రవర్తి ఒక మహాక్రతువును జరిపి, విరివిగా దానధర్మాలను చేయసాగాడు. అదే తగిన సమయమని వామనుడైన విష్ణువు బలివద్దకు వచ్చాడు.
నీలిమమును గ్రుమ్మరించు- నింగితోడ చెలిమిచేసి
నీలమ్మును పంచుకొన్న నీలాంబుజమేయనంగ.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087