జాతీయ వార్తలు

‘హోదా’ హామీ నిలబెట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షం నాయకుడు పీవీ మిథున్‌రెడ్డి పార్లమెంట్‌లో కోరారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో సోమవారం జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల ఆదాయం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 44 శాతం మంది రైతులు అప్పుల్లో ఉంటే ఏపీలో 77 శాతం రైతుల అప్పుల్లో మునిగిపోయారని వెల్లడించారు. బ్యాంకుల్లో అప్పులు పెరిగిపోతున్నాయని.. వారిని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల అభివృద్ధికి స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని అన్నారు. మేకేన్ ఇండియాకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందని.. వస్తువుల తయారీని పెంచేందుకు సంబంధించిన రాయితీలు కేంద్రం ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని 2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే కూడా హామీ ఇచ్చిందని.. ఆ హామీని నిలబెట్టుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఏపీకీ ప్రత్యేకహోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందని, రాష్ట్ర ప్రభుత్వం వడ్డీల కింద ఏటా రూ.20వేల కోట్లు కట్టాల్సివస్తోందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అష్టకష్టాలు పడాల్సివస్తోందని పేర్కొన్నారు. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు పార్లమెంట్ సాక్షిగా ఏపీకి హోదాపై హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. ఇదేమీ కొత్త డిమాండ్ కాదని.. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాత్రమే అడుగుతున్నామని పేర్కొన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదాతోపాటు చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఏపీ నుంచి ఎక్కువ స్థానాలు గెలుచుకొందని, తమ పార్టీవారు మాట్లాడేందుకు మరింత సమయం కావాలని, అలాగే మరికొందరు సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను మిథున్‌రెడ్డి కోరారు.

చిత్రం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షం నాయకుడు పీవీ మిథున్‌రెడ్డి