ఆంధ్రప్రదేశ్‌

పండుగలా వైఎస్సార్ రైతు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: వైఎస్సార్ రైతు భరోసాను ఒకే రోజు ఇచ్చేద్దాం.. ఓ పండుగలా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాస్తవానికి ఈ పథకాన్ని వచ్చే ఏడాది మే నుంచి అమలు చేద్దామని భావించామని, అయితే రైతుల ఇబ్బందుల నేపథ్యంలో ఈ రబీ నుంచే అమల్లోకి తెస్తామన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. 1.25 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారని, 2.5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారు 70 శాతం వరకు ఉంటారని తెలిపారు. అక్టోబర్ 15న 50 శాతం మంది రైతులకు రైతు భరోసా అందుతుందని వెల్లడించారు. స్టాంప్ పేపర్ ఫార్ములా తరహాలోనే కౌలు రైతుల కోసం ఓ పత్రాన్ని గ్రామ సచివాలయంలో ఉంచుతామని, 11 నెలల కాలానికి భూమిపై హక్కులు కాకుండా, పంట సాగు చేసుకునేలా అనుమతులు రైతుల నుంచి అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దీనివల్ల కౌలు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. కౌలు రైతులు ఎంతమంది ఎక్కడ ఉన్నారు? ఏ భూమిని సాగుచేస్తున్నారనే అంశాలపై స్పష్టత వస్తుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తిస్తుందని ప్రకటించారు. రైతు కుటుంబాలకు ఏది జరిగినా ఆత్మహత్య చేసుకున్నా.. ప్రమాదంలో మరణించినా కలెక్టర్లు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నిమిత్తం లేకుండా నేరుగా ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేను కలుపుకుని పరామర్శించాలన్నారు. బాధిత కుటుంబానికి రూ. 7 లక్షలు ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వేధిస్తే చర్యలు తీసుకుంటామని శాసనసభలో చట్టం తీసుకువస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత ఉందని పలువురు మంత్రులు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందించటంలో ఇబ్బందులు కలుగకుండా చూడాలని సీఎం జగన్ నిర్దేశించారు. గత ప్రభుత్వ ప్రణాళికా లోపం కారణంగానే సమస్యలెదురయ్యాయని మంత్రి కన్నబాబు ఆరోపించారు. వచ్చే ఏడాదికి అవసరానికంటే పదిశాతం ఎక్కువ విత్తనాలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా విత్తనాల సమస్యను నివారిస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు. విత్తనాలకు నిధుల విడుదల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయ విత్తనాలైనా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చే ఐదేళ్లకు సరిపోను విత్తనాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విత్తనాల నాణ్యతకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయటం లేదా ప్రభుత్వమే నేరుగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. మిర్చి విత్తనాలకు ఎమ్మార్పీ ధర ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. మినీ గోకులాల సబ్సిడీలు పెండింగ్‌లో ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. అయితే గోకులాలను టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేశారని మంత్రి రంగనాథరాజు ఆరోపించారు. ఇప్పటికే నిర్మించి ఉంటే పార్టీల కతీతంగా చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రతి గొర్రెకు రూ. 6 వేలు బీమా
పశువుల రైతుల సంక్షేమంలో భాగంగా ప్రతి గొర్రెకు రూ. 6వేలు బీమా ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. పశువులకూ బీమా అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పశు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. పశువుల ఆస్పత్రి, వెటర్నరీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు నిర్దేశించారు. అవసరమైన దాణాను కూడా అందుబాటులోకి తేవాలన్నారు.
చిత్రం...కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి