సత్తాచూపిన కబీర్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతేడాది వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ ఒక ఊపు ఊపేసింది. తాజాగా హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రెండు చిత్రాలకూ దర్శకుడు -సందీప్ వంగానే. కబీర్‌సింగ్ కేవలం ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌కు చేరిందట. వరల్డ్ కప్ సీజన్‌లో సైతం భారీ గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషమని విశే్లషకులు అంటున్నారు. అమెరికాలో సినిమాకు భారీ డిమాండ్ రావడంతో, రెండోవారం నుంచి 45 సెంటర్లను పొడిగించారు. షాహిద్‌కపూర్, కైరా అద్వానీ కెమిస్ట్రీ అదిరిపోవడంతో, విదేశాల్లోనూ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు, హీరో షాహిద్‌కపూర్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా కబీర్‌సింగ్ నిలిచిందట.