రంగారెడ్డి

తాండూరు బల్దియాలో వార్డుల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 30: తాండూరు బల్దియాలో ప్రభుత్వం వార్డుల పెంపు పట్ల స్థానిక ప్రజలు వార్డు కౌన్సిలర్ల రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు 31 మున్సిపల్ వార్డులు ఉండగా పట్టణ శివారుల్లోని రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మకాలనీ, విజయనగర్ కాలనీ, రసూల్‌పూర్ ప్రాంతాలను మున్సిపల్ అధికారులు మున్సిపల్ పరిధి విస్తరణలో భాగంగా కాలనీలను మున్సిపాలిటీలో విలీనం చేసి 36 వార్డులుగా మార్చారు. తాండూరు బల్దియా జనాభాకు అనుగుణంగా 40 వరకు వార్డులు పెంచాలనే వాదనలు సైతం వినపడుతున్నాయి.

కుల సంఘాలకు ఇచ్చిన స్థలాన్ని
కబ్జా నుంచి కాపాడాలి
రాజేంద్రనగర్, జూన్ 30: మండల పరిధిలోని పెద్దషాపూర్ గ్రామంలో పలు కుల సంఘాలకు ఇచ్చిన స్థలాన్ని కబ్జా నుంచి కాపాడి తమకు న్యాయం చేయాలని కుల సంఘాల నాయకులు ఆదివారం పెద్ద ఎత్తున్న ఆందోళనకు దిగారు. హైదరాబాద్ - బెంగళూర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న 151సర్వే నంబర్‌లోని 2425గజాల స్థలంలో ఎస్సీ, రజక, ఆరేసంఘం, బ్యాగరి, మైనార్టీ సంఘాలకు 130గజాల స్థలం చొప్పున అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్లు బాధితులు వివరించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చంద్రశేఖర్.. కుల సంఘాలకు ఇవ్వడం జరిగిందని బాధితులు వివరించారు. ఎమ్మెల్యే అండతో టీఆర్‌ఎస్‌కి చెందిన పలువురు నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి స్థలం చుట్టుపక్కల ఉన్న హద్దురాళ్లను తొలగించారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బలహీన వర్గాలకు చెందిన నాయకులు రాములు, మల్లేష్, నర్సింహా, యాదయ్య, నారాయణ, సాయి, నాగేష్, ఆంజనేయులు, అశోక్, అరవింద్, కుమార్, జావిద్, చాన్‌పాషా పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
కొత్తూరు, జూన్ 30: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ సూచించారు. ఆదివారం నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలోని నాట్కో పాఠశాలలో ప్రభుత్వ అంగన్‌వాడీ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్య ఉంటేనే సకల సిద్ధి ప్రాప్తిస్తుందని వివరించారు. విద్యార్థుల చదువు కోసం, కార్యక్రమంలో ఉమ్మడి మండల ఎంపీపీ శివశంకర్ గౌడ్, నందిగామ ఎంపీపీ మంచన్‌పల్లి ప్రియాంక, సర్పంచ్ రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు పద్మారెడ్డి పాల్గొన్నారు.