హైదరాబాద్

వైద్య శిరోమణి అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మెగాసీటీ నవ కళావేదిక ఆధ్వర్యంలో వైద్యులకు ‘వైద్య శిరోమణి’ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని వైద్యులను అవార్డులను ప్రదానం చేశారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కేవలం డబ్బు సంపాదనే దేయ్యంగా వైద్యం నిర్వహిస్తున్నాయని అవేదన వ్యక్తం చేశారు. వైద్యులు సమాజిక సేవలో భాగస్వాములు కావాలని అకాక్షించారు. ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డా.్భరత్ ప్రకాశ్, ఆచార్య డీకే రెడ్డి, సినీ నటుడు హరినాథ్ బాబు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున రావు, సాయినాథ్, రాఘవ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూన్ 30: అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా సుమధుర ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి లయన్ విజయ్ కుమార్, రాఘవాచార్య, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కారించారు. గాయనీ, గాయకులు అనురాధ, రేవతి, బాపిరాజు, శశికుమార్, రాములు, శ్రీరామ్, రాజ్యలక్ష్మీ, శశిరేఖ, పద్మ, రజని అలపించిన సినీ గీతాలు అలరించాయి.
ఆకట్టుకున్న నిహారిక అరంగేట్రం
కాచిగూడ, జూన్ 30: ప్రముఖ కళాకారిణి నిహారిక దంతేనేని భరత నాట్యం అరంగేట్ర ప్రదర్శన ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మైహోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర రావు, మాజీ మంత్రి కేవీపీ రామచంద్ర రావు, ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం పాల్గొని నిహారికను అభినందించి సత్కరించారు. తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలని పేర్కొన్నారు. నిహారిక చిన్నతనం నుంచే భరతనాట్య కళపై ఆసక్తి పెంచుకుని ప్రముఖ నృత్య గురువు గీతా గణేషన్ వద్ద భరత నాట్యం శిక్షణ తీసుకుని రాణించడం అభినందనీయమని అన్నారు. నిహారికకు భవిష్యత్‌లో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించి గురువుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. నిహారిక ప్రదర్శించిన పలు నృత్యంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.