హైదరాబాద్

‘శ్రీకాళీ శతకము’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: బ్రహ్మశ్రీ అన్నపర్తి కృష్ణశర్మ సిద్ధాంతి రచించిన ‘శ్రీకాళీ శతకము’ పుస్తకావిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత కృష్ణ శర్మ కాళీ శతకము ఎంతో అద్భుతంగా రచించారని అందరికి అర్థమయ్యే రీతిలో శతకలు ఉన్నాయని పేర్కొన్నారు.
అన్నపర్తి కృష్ణశర్మ రచయితగానే కాకుండా పంచాంగకర్తగా, జ్యోతిష సార్వభౌముడిగా ఎంతో ఖ్యాతిని సంపాధించుకున్నారని తెలిపారు. ప్రముఖ సాహితీ వేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించగా భారత్ టూడే టీవీ డైరెక్టర్ జీ.వల్లీశ్వర్, ఆధ్యాత్మిక వక్త ఏఎస్ మూర్తి, కినె్నర అధ్యక్ష, కార్యదర్శులు డా. ఆర్.ప్రభాకర రావు, రాఘురామ్ పాల్గొన్నారు.
అలరించిన ‘కర్ణాటక’ సంగీత కచేరి
కాచిగూడ, జూన్ 30: ప్రముఖ ఆధ్యాత్మిక గాయనీ సూరంపూడి శ్రీమణి నిర్వహణలో ‘కర్నాటక సంగీతోత్సం’ కార్యక్రమం శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లలిత సంగీత దర్శకుడు విన్నకోట మురళీకృష్ణ పాల్గొని గాయకులను అభినందించారు. గాయనీ ఎన్.సుబ్బలక్ష్మీ అలపించిన కర్ణాటక సంగీత కచేరి అలరించాయి.