రంగారెడ్డి

బోనాలకు ‘గోల్కొండ’ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, జూన్ 30: ఆషాఢ జాతరకు గోల్కొండ కోటలో ఎల్లమ్మతల్లి (శ్రీ జగదాంబికా మహాంకాళీ అమ్మవారి)కి నగరంలో మొట్టమొదటగా పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 4నుంచి బోనాల జాతరలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పండుగలలో బోనాల పండుగ ఒకటి. పండుగకు ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నది. 4న గురువారం గోల్కొండ కోటలోపైన ఉన్న అమ్మవారి ఆలయంలో మొదటి పూజను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించి బోనాల జాతరను ప్రారంభిస్తుంది. నిజాం కాలంలో కూడా నవాబులు ఆదరించి ఈ ఉత్సవాలలో పాల్గొని ఘనంగా నిర్వహించేవారు. బోనాల ఉత్సవాలకు లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి భారీ తొట్టెలను అమ్మవారికి సమర్పించేందుకు తీసుకెళ్తారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పింస్తారు. బోనాల జాతరకు నగరం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. బోనాల ఉత్సవాలు నెల రోజుల పాటు ప్రతి అది, గురువారాల్లో తొమ్మిది పూజలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి.
కాకతీయుల కాలం నుంచే..
కాకతీయుల కాలంలో ఓరుగల్లు సామ్రాజ్య అధిపతియైన రాణి రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు భాగ్యనగరంలోని గోల్కొండ ప్రాంతానికి వచ్చి తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈ ప్రాంతంలో మట్టిగోడ నిర్మించేందుకు అమ్మవారికి మొట్టమొదటగా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ క్రమంలో అంతకుముందు కాలం నుంచి ఈ కొండపై స్థానికంగా గొల్లవాళ్లు మేకలను ఈ ప్రాంతంలో మేపేవారు. అప్పటికే కోటపై అమ్మవారి దేవాలయం ఉండేది. అమ్మవారికి పూజలను, అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించినట్లు నానుడి. ప్రతాపరుద్రుడు అనంతరం నిజాం ఈ ప్రాంతాన్ని పరిపాలించి గొల్లకొండ ప్రాంతం గోల్కొండ నామంగా మారిందని పూర్వీకులు తెలిపినట్లు స్థానికులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు గోల్కొండ కోటపై శ్రీజగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల జాతర కొనసాగుతుంది. గోల్కొండ బోనాలు ప్రారంభమై సుమారు 900 సంవత్సరాలు అవుతుందని తెలిపారు
అమ్మవారికి పట్టువస్త్రాలు
అమ్మవారి ఆలయంలో తొలిపూజ రోజు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది. దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రుల కూడా ఇక్కడి వచ్చి లంగర్‌హౌస్‌లోని భారీ తొట్టెలకు పూజలను నిర్వహించి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
భారీ తొట్టెల ఊరేగింపు
శ్రీజగదాంబిక మహాంకాళీ అమ్మవారికి భారీ తొట్టెలను సమర్పిస్తారు. ఈ తొట్టెలను లంగర్‌హౌస్ చౌరస్తాలో ముందుగా ఏర్పాటు చేసి, అనంతరం పూజలను నిర్వహించి అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా కోటపైకి భక్తులు తీసుకు వెళ్తారు. ఈ తొట్టెల ఊరేగింపులో డప్పు వాయిద్యాలు శివసత్తులు పునకం, పోతురాజులు నృత్యాలతో, యువత కేరింతల నడుమ భారీగా కోటపైకి తొట్టెలను సమర్పిస్తారు.
పూజారి ఇంటి నుంచి...
బోనాల ఉత్సవాల మొదటి రోజు అమ్మవారి మూల విగ్రహాలను గోల్కొండ బడాబజార్‌లో ఉన్న పూజారి ఇంటి నుంచి భారీ ఊరేగింపుగా కొనసాగిస్తారు. పూజారి ఇంట్లో అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అక్కడి నుంచి ఊరేగింపుగా గోల్కొండ కోటపైకి తరలివెళతారు. అమ్మవారి బోనాల జాతరలో భాగంగా తొమ్మిది పూజలను నిర్వహిస్తారు. ఈ పూజ మొట్టమొదటగా 4న ప్రారంభమై ఆగస్టు 1న అమ్మవారికి చివరి పూజ కొనసాగుతుంది.