రాష్ట్రీయం

ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల విభజనలో న్యాయం జరిగేలా సీఎం చొరవ చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 30: ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల విభజన, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాల విషయంలో న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూరించాలని, ఉమ్మడిగా ఉన్న 14 ఆస్తుల్లో ఏపీ ఆర్టీసీకి రావాల్సిన వాటాను ఇప్పించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన 500 మంది ఉద్యోగులు అక్కడే ఉండిపోయారని, వారందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. ఇక రాయలసీమ ప్రాంతానికి చెందిన దాదాపు 160 మంది కాంట్రాక్ట్ కండక్టర్లు, డ్రైవర్లను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అదనపు సిబ్బంది పేరిట తొలగించారని, రెండేళ్లుగా వీరంతా ఎలాంటి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నందున వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.