తెలంగాణ

సిద్దిపేట భవిష్యత్‌కు అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 30 : జిల్లా కేంద్రమైన సిద్దిపేట జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రజల భద్రత కోసం, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండ.. ప్రమాదాలు నివారించేందుకు భవిష్యత్ సిద్దిపేట కొరకు పుట్‌ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట రైతుబజార్ వద్ద నూతనంగా నిర్మించిన పుట్‌ఓవర్ బ్రిడ్జిని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో రెండవ రోజు పుట్‌ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోటిలింగాల గుడి వద్ద మూడవది, పాత బస్టాండ్ వద్ద నాల్గవ బ్రిడ్జిని ప్రారంభించుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కరీంనగర్ రోడ్డులో నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అ సౌకర్యం కలగుకుండ అవసరమగు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు డివైడర్లు దాటకుండ పుట్‌ఓవర్ బ్రిడ్జిలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటుకు చొరవ చూపాలి
సిద్దిపేటలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీనికి కనేక్షన్లు ఇచ్చే విధంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని మాజీ మంత్రి హరీష్‌రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో 12 వార్డుల్లో పూర్తయిందన్నారు. అ వార్డుల్లో అవగాహన సదస్సులు వెంటనే చేపట్టాలన్నారు. ప్రజలు కనేక్షన్ ఇచ్చుకునే విధంగా చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా ఇంటి మురికి నీరు మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనేక్షన్ ఇవ్వాలన్నారు.
వర్షపు నీటిని వరద కాలువలోకి పోయే విధంగా చూడాలన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, ఇతర అనుమతులు ఇచ్చే వారికి ఖచ్చితంగా రెండు మొక్కలు నాటాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించే విధంగా కమిషనర్ చొరవ చూపాలన్నారు. భవిష్యత్ సిద్దిపేటకు అడుగులు వేసేందుకు పట్టణాన్ని సమగ్రాభివృద్ధికి భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి,కౌన్సిలర్లు గ్యాదరి రవీందర్, వజీర్, మొయిజ్, సాకి ఆనందప్, రామన్న తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...సిద్దిపేటలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు