తెలంగాణ

రైతులు తలుచుకుంటే రాజైనా గద్దె దిగాల్సిందే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్(నాజామాబాద్), జూన్ 30: రైతులు తలచుకుంటే రాజైనా గద్దె దిగాల్సిందేనని, అందుకు నిదర్శనం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి చెందడమేనని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఇందూరు అన్నదాతల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా మున్నూరుకాపు సంఘం అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ కొనసాగుతున్నారని, ఆయన స్ఫూర్తితోనే తాను సేవా కార్యక్రమాలు అనేకం చేపట్టడం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో అడుగుపెడితే ఎంత సంతోషం కలుగుతుందో, మున్నూరుకాపు సంఘం తనను సన్మానిస్తున్న ఈ తరుణంలో అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతోందన్నారు. ప్రజలు, మున్నూరుకాపుల ఆశీర్వాదంతో తాను ఎంపీగా గెలవడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంలో తాను ప్రజలకు ఒక పిలుపునిచ్చానని, అదేమిటంటే అన్నదాతతో ఎవరైనా పెట్టుకుంటే ఏమైతదో ప్రతిపక్షాలకు తెలియజెప్పడం జరిగిందన్నారు. రైతులు నీళ్ల కోసం కొట్లాడితే జైల్లో పెడతావా, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను రైతులు ఓడించారని అన్నారు. ఆ ఎన్నికల్లో 177 మంది రైతులు నామినేషన్ దాఖలు చేయడంతో నిజామాబాద్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని కొనియాడారు. ఆ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ తన గెలుపుకోసం ఎవరెవరితో మాట్లాడారో తనకు తెలుసునని, తాను చేసిన ప్రయత్నం వల్ల పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. దేశంలో మోడీ నాయకత్వంలో బీజేపీ 303ఎంపీ స్థానాలను కైవసం చేసుకుందని, మిత్రపక్షాలతో కలిసి 356 స్థానాలను గెలుపొందడం జరిగిందన్నారు. ఇంత పెద్ద మెజార్టీ రావడానికి కారణం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలేనని, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 50కోట్ల మందికి ఆరోగ్య సేవలను అందిస్తున్నారని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని మోడీకి ఎక్కడ పేరు వస్తుందోననే భయంతో అమలు చేయడం లేదన్నారు. అలాగే పంటల బీమా, స్వచ్ఛ భారత్, జన్‌ధన్ ద్వారా దేశంలో 19 కోట్ల అకౌంట్లను తెరిపించడం జరిగిందన్నారు. ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలెండర్లను, మేకిన్ ఇండియా లాంటి పథకాలను పేదలకు అందించడం వల్లే దేశంలో మోడీ సర్కార్ రెండవసారి అధికారాన్ని చేపట్టిందన్నారు. ప్రతిపక్షాల వలే బీజేపీ బాధ్యతారహితంగా ప్రవర్తించదని అన్నారు. భారతరాజ్యంగ నిర్మాత బీ.ఆర్.అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అన్ని వర్గాల కోసం తీసుకువచ్చారని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు (టీఆర్‌ఎస్) తమ స్వార్థం కోసం రిజర్వేషన్లను తీసుకువచ్చి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మతతత్వ రాజకీయాల వలే రాష్ట్రంలోని కేసీ ఆర్ ప్రభుత్వం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. కాశ్మీర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాటలు వినకుండా 370 ఆర్టికల్‌ను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని, దాంతో అక్కడ ఘర్షణలు చెలరేగుతున్నాయన్నారు. మనమంత హిందువులమని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కృషి చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అగ్రవర్ణాల కంటే వెనుబడిన తరగతులు చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. వెనుకబడిన తరగతులకు వృత్తి అనేది లేకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను కొన్ని ఇబ్బందుల వల్ల తాను మాట్లాడలేనని ఆయన అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన ధర్మపురి అర్వింద్ సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్లే అన్ని వర్గాల ప్రజలు అర్వింద్‌ను గెలిపించారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని అర్వింద్ నిలబెట్టుకుంటారని, తనను ఆశీర్వదించినట్లుగానే తన బిడ్డ అయిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. అనంతరం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ను ఘనంగా సన్మానించారు.
చిత్రం...అన్నదాతల ఆత్మీయ సన్మాన సభలో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్