తెలంగాణ

చండ్రుపల్లి బొగ్గు నిక్షేపాలను పరిశీలించిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్/కాళేశ్వరం, జూలై 3: భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని చండ్రుపల్లిలో వ్యవసాయ భూమి వద్ద బోరు వేస్తుండగా బొగ్గు నిక్షేపాలు బయటపడ్డ విషయం వెలుగులోకి రావడంతో బుధవారం సింగరేణి సంస్థ అధికారులు చండ్రుపల్లిని సందర్శించారు. చండ్రుపల్లి గ్రామానికి చెందిన జాడి సురేందర్ వ్యవసాయ పొలంలో బోరు వేస్తుండగా బొగ్గునీరు రావడంతో ఆయన అదే వ్యవసాయ భూమిలో మూడు చోట్ల బోరు డ్రిల్లింగ్ చేయించాడు. మొదట 500 ఫీట్ల లోతు వేయడంతో నీరు రాకపోవడం మరో ప్రదేశంలో బోరువేయడంతో బొగ్గు వచ్చిందని, తదుపరి మూడవ సారి డ్రిల్ వేస్తున్న క్రమంలో 35 ఫీట్లలో బొగ్గుతో పాటు నల్లటి నీరు రావడంతో దానిని నిలుపుదల చేశారు. చండ్రుపల్లి బొగ్గు నిక్షేపాలపై వార్తలు రావడంతో రామగుండం సింగరేణి సంస్థకు చెందిన హెచ్‌వోడీ డిప్యూటీ జనరల్ మేనేజర్ జువాలజీ అధికారి పీవీకే అప్పారావుతో పాటు సంస్థ సర్వే అధికారి శ్రీనివాస్, ఇంజనీర్ గోవర్ధన్‌రావులు బుధవారం సురేందర్‌కు చెందిన వ్యవసాయ పంట పొలాలను సందర్శించారు. ఆయన వేసిన బోర్ల ప్రదేశాలను పరిశీలించారు. అక్కడ ఉన్న మట్టి, బొగ్గు నమూనాలను పరిశీలిస్తూ పరిశోధన కోసం తీసుకవెళ్తున్నట్టు డిప్యూటీ జనరల్ మేనేజర్ పీవీకే అప్పారావు తెలిపారు. 1969లో తన తాత ఇక్కడ వ్యవసాయ నీరు కోసం బావి తవ్వించాడని, అప్పుడు బొగ్గు పడడంతో పది సంవత్సరాల తరువాత దానిని మూసివేశారని, 1994-97 మధ్యలో సింగరేణి సంస్థ వారు తెలపడం వల్ల ఈ ప్రాంతంలో సర్వేలు చేపట్టి పరిశోధన చేశారు. ఆ క్రమంలో నక్సల్స్ ప్రభావితంతో వారు విరమించుకోవడం వల్ల తాజాగా మంగళవారం బొగ్గు బయటకు రావడం పట్ల సింగరేణి అధికారులు ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సూచన ప్రాయంగా వారి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉండడంతో గనులు ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

చిత్రం...బొగ్గు నిక్షేపాలను పరిశీలిస్తున్న సింగరేణి అధికారులు