క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్‌కు రాయుడు గుడ్ బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. ప్రపంచ కప్‌లో చోటు ఖాయమని చివరకు ఊరించిన అవకా శం కాస్త విజయ్ శంకర్‌కు దక్కడంతో తీవ్ర మనస్తా పానికి గురయ్యాడు. మరోవైపు స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నా జట్టులోకి తనను కాదని, యువ క్రికెటర్లు రిషభ్ పంత్, మయంక్ అగర్వాల్‌ను తీసుకోవడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు వీడ్కో లు చెప్పినట్లు తెలుస్తోంది.
ఫాం లేమీ కారణంగా చాలారోజులు జాతీయ జట్టుకు దూరమైన రాయుడు, తన పునరా గమనాన్ని ఘనంగా చాటాడు. ఐపీఎల్‌తో పాటు గత న్యూజిలాం డ్ పర్యటనలో అద్భుతంగా రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి వరకు జట్టులో సమస్యగా మారిన 4వ స్థానానికి రాయుడు సరిపోతా డని అనుకున్నారంతా. అయతే అనూహ్యాంగా ప్రపం చకప్ జట్టులో మాత్రం రాయుడుని కాదని ఆల్‌రౌండ ర్ విజయ్ శంకర్‌ని జట్టులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ త్రీ డైమెన్షన్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ప్రకారమే విజయ్ శంకర్‌ని ప్రపంచకప్ జట్టుకి ఎంపిక చేసినట్లు వివరణ కూడా ఇచ్చాడు.
అయతే ఈ వివరణపై రాయుడు స్పం దించిన తీరు కాస్త వివాదాస్పదమైంది. త్రీడీ కళ్లద్దాలకు ఆర్డర్ చేశాన ంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం అప్పట్లో దూమారమే లేపింది. అప్పటికీ రాయుడు బాధ తాము అర్థం చేసుకున్నామని, స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక చేస్తున్నట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కానీ మెగా టోర్నీలో శిఖర్ ధావన్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్ వంటి ఆటగాళ్లు తప్పుకున్న రాయుడుని కాకుం డా రిషభ్ పంత్, మయంక్ అగర్వాల్‌ని తీసుకోవడం తోనే అంబటి రాయుడు బుధవారం ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అయతే పరిమిత ఓవర్ల క్రికెట్ పై దృష్టి సారించాలనే ఉద్దేశ్యంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు కూడా గతంలోనే తప్పుకున్నాడు.
సెలక్టర్ల తీరు తప్పు పట్టాల్సిందే..
అంబటి రాయుడు విషయంలో సెలక్టర్ల తీరు తప్పు పట్టాల్సిందేనని మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ అన్నాడు. హైదారాబాద్‌కు చెందిన రా యుడు జట్టులో చోటు దక్కకపోవడంతోనే వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో 1 సెంచరీ, 10 అర్ధ సెంచరీలున్నా, అతడిని కాదని యువ ఆటగాళ్లను ఎంపిక చేయడాన్ని తప్పుపట్టాడు. రాయుడు వీడ్కోలుపై బాధపడుతున్నట్లు చెప్పాడు.
ఏ ప్రాతిపాదికన ఎంపిక చేశారు..
ప్రపంచకప్ జట్టులో యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, మయంక్ అగర్వాల్‌ను ఏ ప్రాతిపాదికన ఎంపిక చేశారని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశ్నించారు. మెగా టోర్నీకి ఎంపిక చేయాలంటే వారు ఆడిన మ్యాచ్‌లు, పరుగులు ఆటతీరును చూడాల న్నాడు. వారందరికంటే అంబటి రాయుడు ఈ విషయంలో చాలా ముందున్నాడని, అయనా సెలక్టర్లు ఎంపిక చేయలేదని వాపోయాడు.

రాయుడు క్రికెట్ కెరీర్
*
వనే్డలు: 55
ఇన్నింగ్స్‌లు: 50
పరుగులు: 1694
సెంచరీలు: 3
అర్ధ సెంచరీలు: 10
అత్యధిక స్కోరు: 124
యావరేజ్: 47.06
వికెట్లు: 3
*
టీ20లు: 6
ఇన్నింగ్స్‌లు: 5
పరుగులు: 42
అత్యధిక స్కోరు: 20
యావరేజ్: 10.05
*
ఐపీఎల్ : 147
ఇన్నింగ్స్‌లు: 140
పరుగులు: 3300
అత్యధిక స్కోరు: 100
సెంచరీలు: 1
అర్ధ సెంచరీలు: 18
యావరేజ్: 28.07
*
మొదటి వనే్డ:
2013 జూలై 24, జింబాబ్వేతో
చివరి వనే్డ:
2019 మార్చి 8, ఆస్ట్రేలియాతో
మొదటి టీ20:
2014 సెప్టెంబర్ 7 ఇంగ్లాండ్‌తో
చివరి టీ20:
2015 అక్టోబర్ 5 దక్షిణాఫ్రికాతో
*
ఫస్ట్ క్లాస్ క్రికెట్

మ్యాచ్‌లు : 97
రన్స్: 6151
అత్యధిక స్కోరు: 210
సెంచరీలు:16
అర్ధ సెంచరీలు: 34
యావరేజ్: 45.56
వికెట్లు: 10
ఉత్తమ గణాంకాలు: 4/43
చిత్రం... టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు