Others

ఆఫీస్ సిండ్రోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అన్నీ కంప్యూటర్ ఉద్యోగాలే.. అందుకే ఆఫీసులో గంటలకొద్దీ సమయం కంప్యూటర్ల ముందు కూర్చుని గడిపేస్తూ ఉంటాం.. అలాంటప్పుడు మనం కూర్చునే భంగిమ సక్రమంగా ఉందో, లేదో అని సరిచూసుకోవాలి. లేదంటే ఆఫీస్ సిండ్రోమ్ తాలూకు సమస్యలు తప్పవు. ఆఫీస్ సిండ్రోమ్ అంటే.. సక్రమమైన కుర్చీలు, టేబుళ్లు వాడకుండా, సక్రమమైన భంగిమల్లో కూర్చోకుండా పనిచేసినప్పుడు ఎదురయ్యే శారీరక సమస్య.
స్టాటిక్ పోశ్చర్
మన శరీరం ఒక భంగిమను 20 నిముషాలకు మించి భరించలేదు. కాబట్టి తరచుగా కూర్చున్న భంగిమ మార్చడం, లేచి నిలబడడం, ఒళ్లు విరుచుకోవడం, నడవడం చేయాలి.
స్క్రీన్ ఎత్తు
ఆఫీసు సీటులో కూర్చుని కళ్లు మూసుకుని నెమ్మదిగా తెరవాలి. కళ్లు తెరచి చూసినప్పుడు చూపు ఎదురుగా ఉన్న కంప్యూటర్ మానిటర్ మధ్యలోకి సాగితే మీరు కూర్చున్న భంగిమ కరెక్టుగానే ఉందని అర్థం. అలాకాకుండా మానిటర్‌కు ఏ వైపు వంగి ఉన్నా కుర్చీ ఎత్తు సరి చేసుకోవలసి ఉంటుంది.
కుదురైన భంగిమ
కొందరు ముందుకు వంగిపోయి కూర్చుంటారు. మరికొందరు కుర్చీలో జారగిలబడి కూర్చుంటారు. ఇవేవీ సరైన భంగిమలు కావు. వెన్ను నిటారుగా ఉంచి మెడ, తల ఒకే సరళరేఖలో ఉండేలా చూసుకోవాలి. వెన్ను కుర్చీకి తాకాలి.
సీటు
కుర్చీలో కూర్చున్నప్పుడు ఎదురుగా ఉన్న టేబుల్ మోచేతి ఎత్తులో ఉండాలి. మోకాళ్లు, పాదాలు ఒకే సరళ రేఖలో ఉండాలి. కుర్చీ ఎత్తు ఎక్కువగా ఉంటే పాదాల అడుగున ఫుట్ రెస్ట్ ఏర్పాటు చేసుకోవాలి.
*