క్రైమ్/లీగల్

కేశంపేటలో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 12: కేశంపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆరు మంది బృందం సభ్యులతో కేశంపేట తహశీల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు చేరుకొని భూ రికార్డులను తనిఖీలు చేస్తున్నారు. మూడేళ్ల కాలంలో తహశీల్దార్ లావణ్య చేసిన అవినీతిపై ఏసీబీ అధికారుల బృందం సభ్యులు లోతుగా విచారణ మొదలు పెట్టారు. కేశంపేట తహశీల్దార్ కార్యాలయానికి సంబంధించిన రికార్డుల్లో షాద్‌నగర్ ఆర్‌డీఓ ఆఫీసు అధికారులు ఏమైనా చేశారా అనే విషయాలపై విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తొంది. తహశీల్దార్ లావణ్య కేశంపేట మండలంలో ఎక్కడెక్కడ భూ దందాలు చేశారు.. ఎవరి నుంచి ఎంతమొత్తంలో నగదు తీసుకున్నారనే కోణాల్లో రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు విచారణ మొదలుపెట్టారు. నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విఆర్‌ఓ అంతయ్యతోపాటు కేశంపేట తహశీల్దార్ లావణ్యను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించిన విషయం అందరికి తెలిసిందే. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి చోటు చేసుకోవడంతో రెండు రోజుల నుంచి.. బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యలో నలుగురు సీఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మొత్తం ఆరుగురు ఏసీబీ అధికారుల బృందం సభ్యులు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కేశంపేట తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని భూ రికార్డులను తనిఖీ చేస్తున్నారు.