Others

వెనిజులా సంక్షోభం స్వయంకృతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనిజులా దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. ఆహారం కొరత తాండవిస్తోంది. ద్రవ్యోల్బణం 720 శాతం పెరిగింది. ముద్రించిన కరెన్సీకి, నిత్యావసరాలకు పొంతన లేనందున సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాటా 30,000 రూ.లకు (్భరత కరెన్సీలో), లీటరు పాలు 48,000 రూ.కు చేరడం ఆర్థిక సంక్షోభం పరాకాష్ఠను తెలియజేస్తున్నది.
పూర్వపు వెనిజులా రాజు హుగొచవెజ్ కాలంలో మొదలైన ఈ సంక్షోభం నికొలస్ మచురో కాలంలోనూ కొనసాగుతున్నది. ఆకలి, రోగాలు, నేరాలు, చావులు, జనం వలస పోవడం వంటివి నిత్యకృత్యమైపోయాయి. సుమారు 30 లక్షల మంది అమెరికా, మెక్సికో, కొలంబియా, కోస్తారికా, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా దేశాలకు వలస వెళ్ళారు. ఇంకా భారీ సంఖ్యలో వెళ్తున్నారు.
1920-70 మధ్య వెనిజులాలో చమురు నిక్షేపాలు కనుగొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద నిక్షేపాలవి. చమురు ధరలే ఏ దేశ ఆర్థిక ప్రగతినైనా నిర్ణయిస్తాయి. 1980-1990 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి. వెనిజులా ఋణగ్రస్తమైంది. 1998లో అధికారంలోకి వచ్చిన హుగొచవేజ్ సామాజిక సేవలను విస్తరిస్తానన్నాడు. కాని దేశమంతటా అవినీతి పెరిగింది. చమురు ఉత్పత్తి తగ్గడంలో ఋణభారం పెరిగింది. 1985-94లో బ్రెజిల్‌లో వచ్చిన ఆర్థిక సంక్షోభం, జింబాబ్వేలో 2008-09లో వచ్చిన అధిక ద్రవ్యోల్బణం, 90వ దశకంలో రష్యా విచ్ఛిన్నం కావడం కంటె అధికంగా వెనిజులాలో సంక్షోభం నెలకొని వుంది.
2010-12 మధ్య చవేజ్ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలనివ్వలేదు. 2013లో ఆయన చనిపోయాడు. ఆయన తరువాత మదురో అధికారం చేపట్టాడు. అప్పటికే ద్రవ్యోల్బణం ఏడాదికి 50% పెరుగుతూ వచ్చింది. ప్రజల కొనుగోళ్ళపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. దీంతో జనంలో నిరసన ఉధృతమైంది. నిరసనోద్యమాన్ని ప్రభుత్వం అణచివేసే క్రమంలో దాదాపువంద మంది చనిపోయారు. ప్రతిపక్ష నాయకుడు జువాన్ గైడో, మదురో మధ్య అధికార పోరు మొదలయింది. ఎన్నికల్లో అక్రమాలు చేసి మదురో 2018లో మళ్ళీ అధికారం దక్కించుకున్నాడు. 2015లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన తనే అసలైన అధ్యక్షుడ్ని అని గైడో వాదిస్తున్నాడు. ప్రజల మద్దతు కూడగడ్తున్నాడు. అమెరికాతోపాటు మరో 50 దేశాలు గైడోను గుర్తించాయి. మదురోను చైనా, రష్యాలు సమర్ధిస్తున్నాయి.
వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని అమెరికానుద్దేశించి రష్యా అంటోంది. ప్రజలు పచ్చిమాంసం, తినడానికి పనికిరాని మాంసం కూడా కొనుక్కుంటున్నారు. విద్యుత్తు లేక మాంసం ప్రాసెసింగ్ యూనిట్లు మూతబడ్డాయి. ఆస్పత్రుల చుట్టూ వైద్య వ్యర్థాలు పేరుకుపోయాయి. తిండికోసం లూటీలు, దాడులు, అల్లర్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు వెయ్యి లక్షల కోట్లతో 10 అగ్ర దేశాల సరసన నిలిచిన వెనిజులా యిపుడు అట్టడుగు 10 దేశాల జాబితాలో చేరింది. తలసరి ఆదాయం రూ. 13,000 నుంచి రూ.1,000కు పడిపోయింది. దక్షిణ అమెరికా ఖండంలో వున్న వెనిజులా ఆయిల్ నిక్షేపాలు తీసేందుకు వచ్చిన అనేక విదేశీ కంపెనీల నుంచి వాటి లాభాల్లో 50% వసూలు చేసేది. 70% మంది కోటీశ్వరులయ్యారు. కాని 30% పేదరికంలోనే వున్నారు. పేద ప్రజలు తిరుగుబాటు చేశారు. చావెజ్ అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ సంక్షేమం పేరిట చదువు, విద్యుత్తు, నీరు, వైద్యం, ఆహారం, బట్టలు, గృహాలు అన్నీ ఉచితంగా యివ్వడం మొదలుపెట్టారు. ప్రభుత్వ వ్యాపారం పెరిగాక ప్రైవేటు వ్యాపారస్థులు తమ దుకాణాలు మూసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ దుకాణాల్లో అవినీతి పెరిగి నల్లబజారు ఊపందుకుంది. ఒకప్పుడు వ్యవసాయం చేసే వెనిజులా ప్రజలు అన్నీ ఉచితంగా లభిస్తుంటే వ్యవసాయం చేయడం మానేశారు. ఆహారోత్పత్తి తగ్గిపోయింది. ఆహారం దిగుమతి చేసుకోవడం మొదలయింది. చమురు లాభాలన్నీ అందుకోసం వెచ్చించడం మొదలైంది. చమురు సంస్థలన్నీ ప్రభుత్వరంగంలోకి తీసుకోబడ్డాయి. అక్కడా పోటీతత్త్వం పోయి అవినీతి మొదలయింది. సాంకేతికాభివృద్ధి మీద దృష్టిపెట్టలేదు. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలే, అందరికీ ప్రభుత్వోద్యోగాలే. 2013లో చావెజ్ చనిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన మదురో కూడా చావెజ్ బాట పడ్డాడు. 2014లో ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లు నుంచి 60 డాలర్లకు పడిపోయింది. మొత్తం ధనం సంక్షేమం పేరిట ఆవిరైపోయింది. 2016లో 30 డాలర్లకు బ్యారెల్ చమురు ధర పడిపోయింది. దీంతో దేశం ఇంకా ఘోరంగా పతనమయిపోయింది. తప్పు పాలకులది, ప్రజలది. అభివృద్ధికి ఓటెయకుండా సంక్షేమానికి ఓటేయడం వల్ల జీవనాధారమే లేకుండా పోయింది.
ప్రజలు ఎక్కడ తమను గెలిపించరోనని సంక్షేమం బాట పట్టి ఖజానా ఖాళీచేసిన ఇతర ప్రాంతాల్లోని పాలకులూ దీని గురించి ఆలోచించాలి. నేడు సంక్షేమం గురించి తెలుగు రాష్ట్రాల్లో పాలకుల పాట శ్రుతి మించుతున్నది. ఆంధ్రప్రదేశ్ ఆదాయం లేక, తెలంగాణా ఆదాయం వున్నా 2 లక్షల కోట్ల అప్పుచేసి సంక్షేమం పేరుతో సంబరాలు చేసుకుంటున్నాయి. సంపద సృష్ఠి మీద ఇద్దరు సీఎంలకూ ధ్యాస లేదు.
ఇక, ఆర్థిక సంక్షోభం వెనిజులాలో మహిళలను వ్యభిచారం బాట పట్టించింది. మరోవైపు రాజకీయ పోరు ముమ్మరమైంది. ప్రతిపక్ష గైడో అనుచరులకు, మదురో మద్దతుదారులకు పార్లమెంటు వేదికగా వెనిజులా స్వాతంత్య్రదినం నాడు భీకర యుద్ధం జరిగింది. రక్తంతో తలలు పగిలాయి. సోషలిజం ప్రజలకు వొరగబెట్టిందేమీ లేదు. పిల్లలను అమ్ముకునే స్థితికి ప్రజలు దిగజారారు. ప్రజల్ని సోమరిపోతులను చేస్తే జరిగే నష్టానికి వెనిజులా ఓ ఉదాహరణ. ప్రజల సంక్షేమం కోసం చావెజ్ క్యూబి వెళ్ళి కాస్ట్రో సలహా కూడా తీసుకున్నాడు. పరిశ్రమలను జాతీయకరణ చేశాక దేశీయ ఉత్పత్తి లేదు. మందులు, వస్త్రాలు, కార్లు అన్నీ దిగుమతి చేసుకోవడం మొదలైంది. 2004-2014 మధ్య చమురు ధరలు పెరిగినపుడు వచ్చిన ఆదాయాన్ని రాబోయే రోజుల కోసం సంరక్షించేందుకు ఓ నిధిని ఏర్పరచలేదు సరికదా, ప్రజలకు సంక్షేమం పేరిట వరాల జల్లు కురిపించాడు. 2012 వరకు వెనిజులా ఎగుమతుల్లో చమురు వాటా 95%గా వుండింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో అది ఋణగ్రస్త దేశమైంది. వెనిజులా బయట దేశాల నుంచి తీసుకున్న అప్పు 150 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా ఆంక్షలు విధించింది. చావెజ్ తరువాత వచ్చన మదురో ఏ సమస్యపైనా దృష్టిపెట్టలేదు. 2012లో వెనిజులా పౌరుడి కనీస ఆదాయం నెలకు 192 డాలర్లు, యిపుడు 20 డాలర్లు. అక్కడి కరెన్సీ బొలివర్ మంచు ముక్కలా కరిగిపోతుంది.
కప్పు కాఫీ ధర 450 నుంచి 70,00,000 బొలివర్లుకు పెరిగింది. ధరలు 155000 శాతం పెరిగాయి. నెలలో ఒకసారి మాంసం కొనాలంటే నెల జీతంలో 3వ వంతు ఖర్చు పెట్టాల్సిందే. రోజుకు 10సార్లు కరెంటు పోతుంది. దీనివల్ల శవాలను కూడా దహనం చేయడం లేదు. అవి కుళ్లి కంపుకొట్టిపోతున్నాయి. రోగులకు ఆసుపత్రుల్లో మందులిచ్చే పరిస్థితి లేదు. ప్రతినెలా 20 మంది పిల్లలు ఆకలితోనో, మందులు లేకనో చనిపోతున్నారు. ఎక్కడా మంచినీరు లభ్యం కావడం లేదు. అమెరికా భారత్‌పై- ‘వెనిజులా నుంచి చమురు కొనవద్ద’ ఒత్తిడి తెచ్చింది. వెనిజులా భారత్‌కు 30% తక్కువ ధరకు చమురు విక్రయించేందుకు సిద్ధపడింది. గల్ఫ్ దేశాల కంటె వెనిజులాలో చమురును వెలికితీయడం 3రెట్లు అధిక ఖర్చుతో కూడుకున్నది కావడం కూడా ఆ దేశానికి ఆర్థికంగా వెసులుబాటు లేకుండా పోయింది. చైనా మాత్రం వెనిజులాలో చమురును వెలికితీసేందుకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. చైనా ఉదారతగా దీన్ని అర్ధం చేసుకోనక్కరలేదు. చైనా లెక్కలు చైనాకుంటాయి. వెనిజులా గత వైభవం సుదూర స్వప్నమే అయ్యింది. ఉత్పత్తి లేక భోగవాదం, వినియోగ వాదం మాత్రం మిగిలిన వెనిజులాను ఉద్ధరించేందుకు నేడు ఎవరూ ముందుకు రావడం లేదు.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్