ఆంధ్రప్రదేశ్‌

గ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జూలై 16: గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ ఆలయాన్ని మంగళవారం సాయంత్రం 6-45గంటలకు మూసివేశారు. తిరిగి బుధవారం వేకువ జామున అమ్మవార్లకు స్నపనాభిషేకం, ఆలయ సంప్రోక్షణ,ప్రత్యేక పూజలు, విశేష పూజలు,తదితర వాటిని నిర్వహించిన అనంతరం ఉదయం 9గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. మంగళవారం సాయంత్రం ఆలయ స్ధానాచార్యుడు విష్ణు బొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు అత్యంత భక్తి ప్రపత్తులతో అమ్మవారికి పంచహారతులు, విశేష పూజలు,నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి సన్నిధితోపాటు నగరంలోని పాతశివాలయంతోపాటు అన్ని ఆలయాలను మూసివేశారు. ఈ సందర్భంగా రాత్రి 8గంటల నుండి అధిక సంఖ్యలో భక్తులు దుర్గగుడి ఘాట్‌కు వచ్చి గ్రహణ స్నానాలు ఆచరించారు.

చిత్రం...కనకదుర్గ ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు, అధికారులు