ఉద్యమక్షేత్రం నుంచి క్రీడామైదానానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరాతో ఉద్యమకారుడి అవతారమెత్తాడు -చిరంజీవి. తరువాత దర్శకుడు కొరటాలతో చేస్తున్న ప్రాజెక్టు కోసం -ప్లేగ్రౌండ్‌లోకి అడుగు పెట్టనున్నాడన్నది లేటెస్ట్ టాక్. అదీ కోచ్ అవతారంలో. ఏ గేమ్‌లో చిరు ఎవరిని ట్రెయిన్ చేస్తాడోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో మొదలైంది. చిరంజీవి తాజా ప్రాజెక్టు -సైరా. షూట్ సుదీర్ఘంగా సాగినా, పోస్ట్ ప్రొడక్షన్స్‌లో మాత్రం స్పీడ్ పెంచారు. తరువాతి ప్రాజెక్టుకు కొరటాల తొందరపడుతున్న నేపథ్యంలో -సైరా ప్రాజెక్టులో తన పోర్షన్‌ని త్వరగా పూర్తి చేసేశాడు చిరంజీవి. కొత్త ప్రాజెక్టు కోసం -వర్కౌట్స్‌పై దృష్టి పెట్టాడట. పాత్రకు తగిన మేకోవర్ కోసం బాడీ సైజ్‌ను తగ్గించాలంటూ దర్శకుడు కొరటాల కొద్ది రోజుల క్రితమే కొన్ని రిఫరెన్స్‌లు ఇచ్చినట్టు కథనాలొచ్చాయి. అందుకు తగినట్టుగా -చిరు సైతం బాడీ స్ట్ఫినెస్ కోసం భారీ వర్కౌట్స్‌పైనే దృష్టి పెట్టాడని వినిపిస్తోంది. స్లిమ్ కమ్ స్ట్ఫినెస్ మేకోవర్‌తో చిరు పిక్స్‌లో త్వరలోనే సోషల్ మీడియాకు ఎక్కొచ్చు. ఇదంతా -చిరు చేయబోయే కోచ్ పాత్ర కోసమేనట. సినీ సమాచారం ప్రకారం చిరు -కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మొదటి వారంలో మొదలుకానుందని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో పదిహేను రోజులు కంటిన్యూ షూట్ ఉండొచ్చని సమాచారం. డైలాగ్ రైటర్‌గా కెరీర్ మొదలెట్టి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన కొరటాల ఇప్పటి వరకూ తన సినిమాల్లో ఏదోక సోషల్ మెసేజ్‌ను పాస్ చేస్తూ వస్తున్నాడు. ఈసారి అందుకు భిన్నంగా స్పోర్ట్స్ బేస్‌డ్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండోవారంలో ఉగాదిని టార్గెట్ చేస్తూ -సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తన్నారట.