ఆగస్టు ..కిక్కే కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిగినింగ్.. కన్‌క్లూజన్’ -విడుదల టైంలో బాహుబలికి వారంముందుగాని, పక్షంతరువాతగాని థియేటర్లకు వచ్చేందుకు ఏ హీరో సాహసం చేయలేదు. భారీతనం ముందు నిలబడితే బక్క’పల్చనైపోతామన్న భయం అప్పట్లో కొంత వెంటాడింది. అందుకే దూరంగా ఉండిపోయారు. నిజానికి వచ్చే నెల అంటే ఆగస్టులోనూ అటువంటి పరిస్థితే కనిపించి ఉండేది. ‘సాహో’ అనుకున్న టైంకి వచ్చివుంటే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో వస్తున్నానంటూ ‘సాహో’ ఆరంభం నుంచి ప్రకటించుకోవడంతో -ఎదురు నిలబడటానికే కాదు, పక్కన కూర్చోడానికీ మామూలు సినిమాలు సాహసం చేయలేదు. సైలెంట్‌గా ఉండిపోయాయి. ఇప్పుడు సీన్ మారింది.

‘సాహో’ వాయిదా పడింది. ఎప్పుడొస్తుందన్నది చిత్ర బృందానికీ పజిల్‌గా మారింది. ఫ్యాన్స్‌కే విసుగుపుట్టేంతగా -సాహో వాయిదాకు సవాలక్ష కారణాలు వినిపిస్తున్నాయి. విడుదల సమయానికి టెక్నికల్ వర్క్ పూర్తి కాకపోవచ్చన్నది ఒక మాట. బాలీవుడ్‌లోనూ సినిమా విడుదల కావాల్సి ఉండటంతో -అదే సమయానికి ‘మిషన్ మంగళ్’లాంటి చిత్రాలు థియేటర్లకు వస్తుండటంతో పోటీ ఇష్టంలేక పక్కకు జరిగాడన్నది మరో మాట. ప్రచారం జరిగినంత గొప్పగా ‘సాహో’లో సత్తా కనిపించక చిత్రబృందం తల పట్టుకుందన్న వ్యితిరేక కథనాలు మరోపక్క. ఏదేమైతేనేం -సాహో వెనక్కి జరిగింది. ఆగస్టు 30న థియేటర్లకు రావొచ్చన్న అంచనాలున్నాయి. కాకపోతే -అధికారిక ప్రకటన వచ్చే వరకూ ‘నమ్మలేని నిజం’గానే చూడాలి.
ఆగస్టులో సాహో రావడం లేదన్న క్లారిటీ వచ్చేయటంతో -కుర్ర హీరోల సినిమాలు రిలీజ్ పోస్టర్లతో కళకళలాడుతున్నాయి. దొరికిన స్లాట్స్‌లో సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఈ హీరోల ముందు ప్రాజెక్టులు చతికిలపడటంతో -ఇప్పుడొస్తున్న సినిమాలతో సక్సెస్ అందుకుని కెరీర్‌కు కొత్త టర్న్ ఇవ్వాలన్న కసితో ఉన్నారు. జూలై సెకెండాఫ్‌లో ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్‌లాంటి చిత్రాలతోపాటు అనువాద చిత్రాలైన ఆమె, మిస్టర్ కెకె, అయోగ్య, డిస్నీ స్పెషల్ గిఫ్ట్ ‘ది లయన్ కింగ్’లాంటి చిత్రాలున్నాయి.
ఇప్పటికే థియేటర్లకు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్‌కి మాత్రమే కనెక్ట్ కావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈనెల చివర్లో 26న వస్తోంది. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో దక్షిణాదిన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. 19న హైదరాబాద్‌లో మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహించనున్నారు.
దీంతో -మీడియం రేంజ్ మూవీస్ అన్నీ ఆగస్టునే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆగస్టు ఆరంభంలోనే -సక్సెస్‌ను వెతుక్కునేందుకు గుణ 369తో కార్తికేయ, రాక్షసుడుతో బెల్లంకొండ సిద్ధమయ్యారు. దీనికిముందు బెల్లంకొండ చేసిన ‘సీత’, కార్తికేయ చేసిన ‘హిప్పీ’ సంతృప్తికరమైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో తాజా ప్రాజెక్టులపైనే హీరోలిద్దరూ గంపెడు ఆశలు పెట్టుకున్నారన్నది నిజం. ఇక ఆగస్టు 9న వెటరన్ హీరో నాగార్జున ‘మన్మధుడు 2’గా వస్తున్నాడు. ఇంతకుముందు చేసిన రాజుగారి గది 2, దేవదాసు చిత్రాలతో నాగ్ ఇమేజ్‌కు కలిసొచ్చిందేమీ లేదు. తాజా రొమాంటిక్ కామెడీ ఒకింత రిలీఫ్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. సాహో ఖాళీ చేసిన ఆగస్టు 15 స్లాట్‌ను శర్వానంద్ ‘రణరంగం’, అడవి శేష్ ‘ఎవరు?’ చిత్రాలు అందుకున్నాయి. కెరీర్‌పరంగా ఇద్దరూ సక్సెస్ రూట్‌లోనే నడుస్తున్నా -ఈసారి సాలిడ్ హిట్ పడకుంటే మాత్రం మార్కెట్లో నిలబడటం కష్టం కావొచ్చు. క్షణం, అమీతుమీ, గూఢచారి విజయాలతో కెరీర్‌ను సక్సెస్ రూట్‌లో నడిపిస్తున్న అడివి శేష్ తాజా చిత్రం -ఎవరు?పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. దర్శకుడిగా వెంకట్ రామ్‌జీ పరిచయమవుతున్న చిత్రాన్ని పరమ్ వి పొట్లూరి, కెవిన్ అనె్న నిర్మించారు. రెజీనా కాసాండ్రా హీరోయిన్. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘క్షణం’వంటి సూపర్ హిట్ తర్వాత అడివిశేష్, పీవీపీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఆగస్టు చివరి శుక్రవారం 30న ‘గ్యాంగ్‌లీడర్’గా వస్తున్నాడు నాని. ‘జెర్సీ’ హిట్‌తో తన రేంజ్‌ను కొనసాగిస్తున్న నానికి మళ్లీ హిట్టుపడితే మాత్రం -రెండు మెట్లెక్కేసినట్టే. సో, గ్యాంగ్‌లీడర్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు నాని. ఒకవేళ ‘సాహో’ కనుక ఆగస్టు 30న కన్ఫర్మ్ చేసుకుంటే -గ్యాంగ్‌లీడర్ ముందుకొస్తుందా? వెనక్కెళ్తుందా? కొనసాగుతుందా? అన్నది మాత్రం చెప్పలేం. ఏదేమైనా సినిమా ప్రేమికులకు మాత్రం ఆగస్టు నెల మాంఛి కిక్కునివ్వనుంది.

-‘వి’