జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్రానికి మరోసారి గుర్తుచేశారు. విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం పూర్తిగా నిరాశపరిచిందన్నారు. 2014 మార్చి 2వ తేదీన ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయమని కోరుతున్నామని చెప్పారు. కేంద్రం చెబుతున్నట్టు 14వ ఆర్థిక సంఘం ఏపీకి పత్యేకహోదా ఇవ్వకూడదని ఎక్కడా ప్రకటించలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి రూ.60వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని వివరించారు. విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని.. కేంద్రం నిధులు ఇవ్వకపోతే వౌలిక వసతుల కల్పన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విభజన సమయంలో పారిశ్రామిక రాయితీలు ఇస్తామని ప్రకటించినప్పటికీ, కేంద్రం వాటిని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని ఆయన చెప్పారు.