రాశిఫలం -07/21/2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ చవితి ఉ.8.13, కలియుగం - 5121 శాలివాహన శకం - 1941
నక్షత్రం: 
పూర్వాభాద్ర పూర్తి
వర్జ్యం: 
మ.12.22 నుండి 2.08 వరకు
దుర్ముహూర్తం: 
సా.04.24 నుండి 05.12వరకు
రాహు కాలం: 
సా.4.30 నుండి 6.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్ర్తిలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యలనెదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనంవల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృధా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. సహనం వహించుట అన్ని విధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనవసర ధనవ్యయంతో ఋణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
Date: 
Sunday, July 21, 2019
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి