Others

రుద్రాక్ష ధారణం పాపహరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం త్రిపురుడు అనే రాక్షసుడు వరగర్వంతో బ్రహ్మాది దేవతలపై దాడి చేశాడు. బ్రహ్మ వరం పొంది ఇంద్రాది దేవతలను స్థానభ్రష్టుల్ని చేశాడు. వారంతా శివుని వద్దకు వెళ్లి, త్రిపురుడి కారణంగా వచ్చి పడ్డ కష్టాలను చెప్పుకున్నారు. తమను ఆ రాక్షసుడి బారి నుంచి తమను కాపాడమని కోరారు.
శివుడు వారికి అభయమిచ్చాడు. త్రిపురుడిని అంతం చేసే అఘోరాస్త్రం కోసం దేవమానం ప్రకారం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి కనులు తెరిచాడు. అలా తెరిచీ తెరవగానే- సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనబడే ఆయన త్రినేత్రాలనుండి బాష్పబిందువులు జలజల రాలి భూమి మీదపడ్డాయి. మరుక్షణమే అవి విత్తనాలై, స్వల్పకాలంలోనే మొలకలెత్తి పెద్ద పెద్ద చెట్లుగా పెరిగాయి. అవే రుద్రాక్ష వృక్షాలుగా పేరు పొందాయి.
రుద్రాక్షల్లో కపిల వర్ణంతో ఉండేవి శివుడి సూర్యనేత్రానివనీ, తెల్లగా ఉండేవి చంద్ర నేత్రానివనీ, నలుపుగా ఉండేవి అగ్ని నేత్రానివనీ మహర్షులు పేర్కొన్నారు. కపిల వర్ణం రాజసానికి, తెలుపు సాత్వికానికి, నలుపు తామసానికి చిహ్నాలు. వీటిలో ఏకముఖ రుద్రాక్షలు మొదలు- పధ్నాలుగు ముఖాలు ఉండే రుద్రాక్షలు ముఖ్యమైనవీ, ఎంతో మహిమ కలిగినవి. ఆయా రుద్రాక్షలవల్ల కలిగే ఫలితాలను కూడా రుషులు వివరించారు. రుద్రాక్షల్లో అనేక రకాలున్నాయ. ఒకే ముఖం ఉన్న రుద్రాక్ష రుద్రస్వరూపం.. దీన్ని ధరిస్తే పరతత్వ జ్ఞానం కలుగుతుంది. రెండు ముఖాలున్నది అర్థనారీశ్వరం. పాపహరం. మూడు ముఖాలున్నది అగ్నిస్వరూపం.. స్ర్తి హత్యా పాపహారి. నాలుగు ముఖాలున్నది బ్రహ్మాత్మకం.. బ్రహ్మహత్యా పాతకాలను పోగొడుతుంది. అయిదు ముఖాలున్నది కాలాగ్ని రుద్రాత్మకం.. పొందకూడనివి పొందినందువల్ల కలిగే పాపాలు పోతాయి. ఆరు ముఖాలున్నది కుమారస్వామి స్వరూపం.. అగ్నిదోషాలను హరిస్తుంది. ఏడు ముఖాలున్నది అనంగాత్మకం.. బంగారం వంటివి దొంగిలించడంవల్ల వచ్చే పాపాలు నశిస్తాయి.ఎనిమిది ముఖాలున్నది వినాయకాత్మకం.. సర్వవిఘ్నాలను తొలగిస్తుంది. తొమ్మిది ముఖాలున్నది భైరవాత్మకం... ఎడమ భుజాన ధరిస్తే భుక్తీ ముక్తీ కలుగుతాయి. పది ముఖాలున్నది జనార్థనాత్మకం.. భూత ప్రేతాలవల్ల వచ్చి పడే చికాకులను దూరం చేస్తుంది. పదకొండు ముఖాలున్నది ఏకాదశ రుద్రాత్మకం.. శిఖపై ధరిస్తే అశ్వమేథ ఫలం వస్తుంది. పనె్నండు ముఖాలున్నది ద్వాదశ సూర్యాత్మకం.. ద్వాదశాదిత్యుల అనుగ్రహం కలిగిస్తుంది. పదమూడు ముఖాలున్నది కార్తికేయాంశం.. సర్వార్థసిద్ధి ప్రదం.శివప్రసాదమైన రుద్రాక్షను ధరించినవారు రోగ రహితులై నిత్యం ఉత్సాహంగా ఉంటారు. అనేక తీర్థయాత్రలు చేసి పొందే పుణ్యం రుద్రాక్షధారణవల్లనే పొందవచ్చుననీ పెద్దలు చెబుతారు.
రుద్రాక్ష గురించి ఏమీ తెలియక పోయనా రుద్రాక్షను శివస్వరూపంగా భావించి ధరిస్తే సిద్ధినీ, అభివృద్ధినీ కలుగజేస్తుంది. శత్రుబాధలు దూరం చేస్తుంది. దుష్టశక్తులు దరిజేరనివ్వదు. శుచితో, పవిత్రతతో ప్రాణావసాన సమయంలో భక్తితో రుద్రాక్ష ధరించినవారికి దీని మహిమవల్ల కర్మఫలాలన్నీ నశించి పునర్జన్మ ఉండదని పురాణాలు పేర్కొన్నాయి.

- నాగలక్ష్మి