Others

సౌభాగ్యదాయిని శ్రావణ గౌరీ వ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే
అని శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని అత్యంత ఆసక్తితో అతివలు చేస్తుంటారు.
శ్రావణం వచ్చే మంగళవారాలు మంగళగౌరీ వ్రతాలకు నిలయాలు. కొత్తగా పెళ్లైన వధువులందరూ శ్రావణ మంగళ గౌరిని అర్చించి తమ ఐదవ తనం నూరేండ్లు ఉండాలని కోరుకుంటారు. తమకు సౌభాగ్యాన్ని అందించమని అమ్మల గన్న అమ్మ మంగళగౌరమ్మను పూజిస్తారు.
ఈ వ్రతం చేసే ముతె్తైదులు వారింటి ఆచారం ప్రకారం ఐదేండ్లు వ్రతాన్ని చేసి ఉద్దాపన చేస్తారు. ఒక్కో ఇంటి పద్ధతి ప్రకారం వాయినాలు ఇచ్చే ముతె్తైదుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం ఐదుగురు, రెండో సంవత్సరం పదిమంది అలా పెరుగుతూ ఐదవ సంవత్సరం ఇరవై ఐదుమంది ముతె్తైదులకు వాయినాలు ఇస్తారు. మరికొందరు ప్రతి సంవత్సరం ఐదుగురు ముతె్తైదువులకే వాయినాలు ఐదేండ్లు ఇస్తుంటారు. ఇది వారి వారి ఇంటి పద్ధతుల ప్రకారం చేస్తారు.
మంగళ గౌరి వ్రతంలో వాయినం తీసుకొనే ముతె్తైదువను సాక్షాత్తు మంగళగౌరిగా భావించి పూజించుతారు. గౌరీదేవిని పూలతో, పసుపుకుంకుమలతో పూజించుతారు. ఆ తరువాత పిండితో ప్రమిదలను చేసి అందులో వెలుగుతున్న జ్యోతులపైన కత్తి పట్టుకుని వ్రతకథను చదువుతారు. ఆ తరువాత ఆ కత్తికి అంటిన మసికి మంచి నెయ్యిని చేర్చి రంగరించి దానిని కాటుకగా వ్రతం చేసే ముతె్తైదువ ధరిస్తుంది. పేరంటానికి వచ్చిన వారికి కూడా ఈ కాటుకను ఇస్తారు. వాయినం తీసుకొనే ముతె్తైదువ కు కూడా ఈ కాటుకను తప్పనిసరిగా ఇస్తారు.
వ్రతకథలో మంగళ గౌరి వ్రతం చేసి అల్పాయుష్కుడైన తన భర్త కు మంగళగౌరీ ఆశీస్సులతో సంపూర్ణ ఆయుష్షును పొందు తుంది సుశీల. సుశీల కు ప్రాప్తింపచేసిన సౌభాగ్యాన్ని తమకు కూడా అందించమని కోరుకుంటూ కలియుగంలో మహిళలు ఈ మంగళగౌరీ వ్రతం చేస్తారు.
మంగళగౌరి పసుపు కుంకుమల్లో, పూలల్లో , ఆవునేతితో వెలిగించి జ్యోతులల్లోను కూడా కొలువుతీరి ఉంటుందని ముతె్తైదువులు వీటిని ఇచ్చి పుచ్చుకుంటారు. మంగళగౌరీ వ్రతంలో తోరపూజ కూడా ప్రధానంగా ఉంటుంది
శుభాలను ఒసగే మంగళగౌరి ఆదిపరాశక్తి స్వరూపమేనని ఆ తల్లిని పూజించిన వారికి లేమి అనేది ఉండదని సకల సౌభాగ్యాలతో ఐదవతనాన్ని అమ్మ ప్రసాదిస్తుందని ద్రౌపదీదేవికి స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పినట్లు పురాణంలో ఉంది. త్రిపురాసుర సంహారానికి శివుడు వెళ్లినపుడు పార్వతీ దేవికూడా మంగళగౌరిని ప్రార్థించి తన మాంగళ్యాన్ని కాపాడమని కోరుకొందట. రుక్మిణీదేవి, సతభామలు కూడా ఈ మంగళ గౌరి వ్రతం చేసినట్లు ఐతిహ్యం. మంగళగౌరి సౌభాగ్యదాయినియై ఇష్టకార్యాలను పూర్తి చేస్తుందని అనాదిగా ఈ వ్రతాన్ని వివాహం అయిన ఐదేళ్ల వరకూ ఈ వ్రతాన్ని చేస్తుంటారు. ఆతరువాత కూడా ప్రతి శ్రావణమాసంలో మంగళగౌరి పూజను ప్రతి మహిళా ఆనందోత్సవాలతో చేస్తుంటారు.

- లక్ష్మీ ప్రియాంక