వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేరంగి దివాన్ ఆచంట వేంకట సాయంఖ్యాన శర్మగారి దర్శనం, సంయోగ వియోగాల గురించి
యథా కాష్ఠంచ కాష్ఠంచ సమయేతాం మహోదధౌ, శ్లోకం
సమత్యచ వ్యపేయేతాం - తద్వద్భూత సమాగమమ్
(రెండు కట్టెలు తడిసి ఒకదానికొకటి అంటుకుని ప్రవాహంలో వెళ్తుంటాయి. కొంతకాలానికి అలలు మోదుకో, గాలి తాకిడికో అవి విడిపోయి ఒంటరిగా సాగిపోతాయి) తర్వాత జానకీరామ్‌కు కథాంశమయ్యింది. డైరెక్టర్ ఏచూరి వెంకట్రామయ్య గారు ద్వారం వారి వద్దకు తీసుకెళ్ళారు.
ఆయన సంగీతం మన కళ్ళకు కనబడని ఎవరితోనో ఆయన వయొలిన్ ద్వారా ఏదో చెప్పుకోవడంలోని ఆర్ద్రత- తర్వాత అక్కగారు వాచీ కొనుక్కోమని ఢిల్లీనుండి డబ్బు పంపితే వయొలిన్ కొనుక్కునేలా చేసింది. బెంగుళూరులో వయొలిన్ అమ్మిన తెలుగతను లంక కామేశ్వరరావు, బెజవాడ రాజరత్నం రేడియో గానసభలో ఆర్కెస్ట్రా తర్ఫీదు చేసి డైరెక్టు చేయడం 15 ఏళ్ళ తర్వాత చూసి గుర్తుపట్టిన జ్ఞాపకం గొప్పగా నిలిచిపోతుంది. పర్లాకిమిడిలో టగూర్ అభిమాని, ఉలవభద్రదొరను, మాటాడుకునే, ఆలోచించుకునే, అనుభవించే సజీవ భాషను ప్రచారం చేస్తున్న గిడుగు రామమూర్తి గారి దర్శనం జానకిరామ్ మనకు మిగిల్చిన గొప్ప జ్ఞాపకాలు.
1924లో బెంగుళూరు సైన్స్ ఇనిస్టిట్యూట్‌లో పరిశోధన నిమిత్తం చేరతారు. బెంగుళూరు నివాసం ఏడేళ్లలో హారీన్, కమలాదేవిలతో పరిచయం. జాతీయ చిత్రకళా ప్రదర్శనలో కౌతా ఆనందమోహన్, ప్రమోదకుమార్ చటర్జీ వంటి వారలతో పరిచయం లభిస్తుంది. బెంగుళూరులోనే సింథ్‌మీర్ చందాని, గుజరాతీ శుక్లా, కన్నడ గోపీనాథ్, కేరళ పనిక్కర్ ఐదుగురూ ఒకటయ్యారు.
నీవెత హరింతు, సుఖకెల్లనీకెయుంతు అన్న పంక్తులు పదే పదే జ్ఞాపకం రాసాగాయి. వనరు చెడ్వగలేను, చచ్చి చావగలేను అంటున్న కృష్ణశాస్ర్తీని జానకిరాం మనకు చాలా స్ఫుటంగా చూపిస్తాడు. స్మృతిపథంలో బళ్లారి నుంచి బెంగుళూరు ప్రయాణం. అనంతపురం స్టేషన్‌లో కృష్ణశాస్ర్తీ కోసం వెంకటచలం అనంతపురంలోనే దిగిపోయిన కృష్ణశాస్ర్తీ. ఆ ప్రయాణంలోనే పరిచయమైన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు అంతా ఓ గొప్ప ఘట్టం. పూర్వపు ధోరణిలో కవిత్వం రూపప్రధానం. కృష్ణశాస్ర్తీ వంటివారి రచన భావ ప్రధానం అని జానకిరాం అంటే,
కలగవు కమలంబులు, హం
సలు కదలవు. చూడవమ్మ, చక్కగ నెవరో
తలక్రిందుగ నాకాశము
నిలిపిన వారత్త చెరువు నీళలలో నన్
వ్రేళ్ళు సడలించి తిన్నగా నీళ్లు త్రాగు
చున్నవాడదె, తెరువరి, కన్నులెత్తి
అట్టి చలి పందిరిని గాచునతివగూడ
సన్నకా ధారనింకను సన్నగించు
వంటి పద్యాలతో, సంగీతం, నాటక రచన ధర్మశాస్త్రం గురించి మాటాడుకున్నారట. మనసు అతి సున్నితమైన త్రాసులా ఉండాలి. ప్రతి విషయాన్ని యుక్తా యుక్తవిచక్షణ కొరకు ఆ త్రాసుతో తూచాలి. గాలిపటం ఆకాశంలో ఎంత ఎగిరినా మనం సూత్రపు పట్టు వదలరాదన్నారట అనంత కృష్ణశర్మగారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

కొమ్మన రాధాకృష్ణారావు