క్రీడాభూమి

మొదటి వనే్డ వర్షార్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయానా, ఆగస్టు 9: వెస్టిండీస్- భారత్ మధ్య గురువారం జరిగిన మొదటి వనే్డ వర్షార్పణం అయంది. మ్యాచ్‌ను రెండుసార్లు వరుణుడు అడ్డుకోవడంతో అంపైర్లు నిలిపివేశా రు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్‌కు బ్యా టింగ్ అప్పగించాడు. దీంతో క్రిస్ గేల్, ఎవిన్ లూయస్ ఇన్నింగ్స్‌ను ఆ రంభించారు. భారత బౌలర్లు భువనే శ్వర్ కుమార్, మహమ్మద్ షమీ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో విండీస్ ఓపెనర్లు పరుగులు తీసేందు కు కష్టపడాల్సి వచ్చింది. ఓవైపు లూయస్ (40, నాటౌట్) బౌండరీలు, సిక్సర్లతో చెలరేగగా, మరోవైపు క్రిస్ గేల్ మాత్రం సింగిల్స్ తీసేందుకు కూడా తీవ్రంగా శ్రమించాడు. దీంతో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్ యాదవ్ నెమ్మదిగా ఆడుతున్న గేల్ (4)ను బౌల్డ్ చేశాడు. అప్పటికీ గేల్ 31 బంతులు ఆడడం విశేషం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షై హోప్ (6, నాటౌ ట్)తో కలిసి లూయస్ భారత బౌలిం గ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నా డు. ఈ క్రమంలో మరోసారి వరుణు డు మ్యాచ్‌కు అడ్డు తగలడంతో గంటన్నరకు పైగా చూసిన అంపైర్లు చివరికి ఆటను నిలిపి వేస్తున్నట్లు ప్ర కటించారు. అప్పటికీ విండీస్ జట్టు 13 ఓవర్లలో వికెట్ నష్టపోయ 54 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు మాత్రమే వికెట్ దక్కింది.
మరో 12 పరుగులు చేస్తే..
విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ రెండో వనే్డ మ్యాచ్‌లో మరో 12 పరుగులు చేస్తే ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా (10,405) అ త్యధిక పరుగుల రికార్డును అధిగ మించనున్నాడు.
మొదటి వనే్డలోనే గేల్ ఈ ఫీట్‌ను అందుకుంటాడని భావించి నా తక్కువ పరుగులకే అవుటై నిరాశ పరిచాడు. మరోవైపు విండీస్ తరఫున అత్యధిక వనే్డలు (296) ఆడిన రికార్డు ను మాత్రం మొదటి మ్యాచ్ ద్వారా చెరిపేశాడు. ఇరు జట్ల మధ్య రెండో వనే్డ పోర్ట్ ఆఫ్ స్పెయన్ వేదికగా ఆదివారం జరగనుంది.