క్రీడాభూమి

కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా మెకల్లామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: న్యూజిలాం డ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లామ్ ఐపీఎల్‌లో (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేయనున్నారని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇందు కు సంబంధించి ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే మెకల్లామ్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఇప్పటికే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించా డు. కోల్‌కతా నైట్ రైడర్ సకు గతంలో పనిచేసిన సైమన్ కటిచ్ స్థానాన్ని బ్రెండన్ భర్తీ చేయనున్నాడు. 2016 లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మెకల్లామ్ ఆ తర్వాత పలు దేశవాళీ టీ20ల్లో మాత్రం కొనసాగాడు. న్యూజిలాండ్ తరఫున మొత్తం 101 టెస్టులాడి 6083 పరు గులు సాధించగా, 302 పరుగులను అత్యధిక స్కోరుగా మలిచాడు. అలాగే 260 వనే్డల్లో 96.37 స్ట్రైక్ రేట్‌తో 6083 పరుగులు చేశాడు.