క్రీడాభూమి

గిల్.. డబుల్ రికార్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రినిడాడ్, ఆగస్టు 9: వెస్టిండీస్ ఏ జట్టుతో జరుగుతున్న మూడో అనధికార టెస్టులో భారత్ ఏ జట్టు చెలరేగి ఆడుతోంది. మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు నిరాశ పరిచినా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ, కెప్టెన్ హనుమ విహారి సెంచరీతో రాణించారు. దీంతో ప్రత్యర్థి జట్టు ముందే భారీ లక్ష్యాన్ని నిర్దేశిం చింది. మూడు వికెట్లు కోల్పోయ శుక్ర వారం ఓవర్ నైట్ స్కోర్ 23 పరుగుల తో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు 50 పరుగుల వద్ద షెహబజ్ నదీమ్ (13) వికెట్‌ను కోల్పోయంది. అయతే అప్పటికే మంచి ఊపు మీదున్న శుభ్‌మన్ గిల్, కెప్టెన్ విహారితో కలిసి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఆతిథ్య జట్టు బౌలర్లకు ఏమాత్రం అవకాశమి వ్వకుండా ఇద్దరు సెంచరీలు సాధించారు. అటు తర్వాత తిరిగి చూడని గిల్, విహారి జంట విండీస్ బౌల ర్లను ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలో విహారి కొంత నెమ్మదిం చినా, శుభ్‌మన్ మాత్రం పరుగుల ప్రవాహాన్ని కొనసాగించా డు. ఈ దశలో గిల్ (204, నాటౌట్) కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా అతి పిన్న వయస్సులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన క్రికెట్‌ర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అంతకుముందు 2002లో జింబాబ్వే పై ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ తరఫున టీమిండియా మాజీ ఆటగా డు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ (218) సాధించాడు. అయతే అప్పటికీ గంభీర్ వయస్సు 20 ఏళ్లు. ఇదిలా ఉంటే 365 పరుగుల వద్ద నాలుగు వికెట్లను కోల్పోయన భారత్ ఏ డిక్లెర్డ్ చేసింది.
జెరీమీ అర్ధ సెంచరీ..
366 పరుగుల లక్ష్యతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఏ జట్టు నిదానంగా ఇన్నింగ్ సను ప్రారంభించింది. ఓపెనర్లు మోంట్సిన్ హాడ్జ్, జెరీమీ సోలోజనో చక్కని ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ 68 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నదీమ్ విడదీశాడు. జట్టు 30వ ఓవర్‌లో మూడో బంతికి హనుమ విహారి పట్టిన క్యాచ్‌తో మోంట్సిన్ హాడ్జ్ (25) పెవిలియన్‌కు చేరాడు. లంచ్ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ ఏ జట్టు 52 ఓవర్లలో వికెట్ నష్టపోయ 128 పరుగులు చేసింది. సోలోజనో (58, నాటౌట్), బ్రాండన్ కింగ్ (42 నాటౌట్) క్రీజులో ఉన్నారు