తెలంగాణ

శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీకి ఎన్‌బీఏ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీకి నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ మల్లేశ్వరి తెలిపారు. శనివారం నాడు కాలేజీలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ నెలలో కాలేజీకి నేక్ గుర్తింపునకు దరఖాస్తు చేస్తున్నట్టు చెప్పారు. కాలేజీలో ఈ ఏడాది నుండి పెద్ద ఎత్తున సెమినార్లు, టెక్నికల్ ఫెస్టులు నిర్వహించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో పిల్లలను చేర్పించడంతో తమపని అయిపోయిందనే భావనతో కాకుండా పిల్లల చదువులపైన కూడా తల్లిదండ్రులు దృష్టిసారించాలని ఆమె చెప్పారు. ప్రాంగణ నియామకాల్లో పలు సంస్థల్లో తమ విద్యార్థులు ఎంపికయ్యారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ కే రాధాకిషన్‌రావు, సభ్యురాలు డాక్టర్ కే మంజీరా పాల్గొన్నారు.