తెలంగాణ

జంతుస్వేచ్ఛపై జాతీయ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: జంతు హింసపై దేశంలో జాతీయ చైతన్యం మొదలైంది. జంతువులకు స్వేచ్ఛ కలిగించాలని ప్రజాచైతన్యాన్ని కలిగిస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘నిస్వర జంతువులకోసం అజ్ఞాత వ్యక్తులు’ హైదరాబాద్‌లో క్యూబ్ ఆఫ్ ట్రూత్ కార్యక్రమాన్ని చేపట్టింది. జంతువులు పుట్టింది వాటిని మనుషులు తినడానికి కాదని, వాటి చర్మాలను దుస్తులుగా ధరించడానికి కాదని, జంతు మాంసం లేకుండానే మనుషులు ఎంతో ఆరోగ్యంగా ప్రత్యామ్నాయ ఆహారపు అలవాట్లతో జీవించవచ్చని ఈ సంస్థ ప్రచారం చేస్తోంది. అనేక సందర్భాల్లో జంతువులను ఎంత క్రూరంగా హింసిస్తున్నారో తెలియజెప్పేందుకు ఆ యా దృశ్యాలను చూపించడం, జంతువుల మారణ రోధన వినిపించడం ద్వారా మనుష్యులు కొన్ని సందర్భాల్లో ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో తెలియపరుస్తున్నారు. జంతువులకూ జీవించే హక్కు ఉందని, వాటికీ మనుష్యుల మాదిరే చట్టపరమైన ,రాజ్యాంగ పరమైన అంతర్జాతీయ హక్కులు ఉన్నాయని , వాటిని మనిషి గౌరవించాల్సిన రోజు ఆసన్నమైందని ఈ సంస్థ ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో చేపట్టిన చైతన్య కార్యఅకమంలో ఆడిటర్ సౌమ్య , లీప్‌జిన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సందీప్ కుమార్, ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి పీ పుకిత్ తదితరులు మాట్లాడారు. ఎవరికోసమో హింసను జంతువులు వౌనంగా భరించడం చూస్తుంటే బాధ కలుగుతుందని సౌమ్య పేర్కొన్నారు. తాను జన్మత మాంసాహారి అయినా జంతు హింస గురించి విన్న తర్వాత తనలో మార్పు వచ్చిందని సందీప్ కుమార్ పేర్కొన్నారు. జీవతత్వంపై కూడా పోరాటం జరగాల్సిన సమయం ఆసన్నమైందని తనకు అనిపిస్తోందని పుకిత్ చెప్పారు.