తెలంగాణ

విద్యాశాఖకు...మార్గదర్శి కావలెను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ విద్యాశాఖలో ఎవరిదారి వారిదే కావడంతో అన్ని విభాగాలనూ ఏకత్రాటిపైకి తీసుకువచ్చి సమన్వయం సాధించాలంటే తక్షణం ఓక మార్గదర్శి కావాలని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖలో ప్రాధమిక విద్య, పాఠశాల విద్య, ఇంటర్ విద్య, కాలేజీయేట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య, యూనివర్శిటీలకు విభాగాల వారీ శాఖాధిపతులు, సీనియర్ ఐఎఎస్ అధికారులూ ఉన్నా అన్ని విభాగాలనూ కలుపుతూ సమన్వయం చేసే సమర్ధ వ్యవస్థ లేకపోవడంతో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇంకో పక్క వివిధ విభాగాలు తీసుకునే నిర్ణయాల పట్ల కొట్లాటలు జరుగుతున్నాయి. కొన్ని అంశాలపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవల్సిన సమయంలో మనకెందుకులే అనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా పరీక్షలు, ఫలితాలు, రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకూ ఏక రూప పాఠ్యప్రణాళిక, వార్షిక ప్రణాళికల రూపకల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, నిరంతర మూల్యాంకనం, సిబ్బంది జవాబుదారీతనం పెంచడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నిజానికి ఉన్నత విద్య మొత్తానికి మండలి ఆ బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నా, అనేక విషయాల్లో సాచివేత వైఖరి, కొన్ని సందర్భాల్లో మెతక వైఖరి, సిబ్బంది కొరతతో కేవలం ప్రవేశపరీక్షలు నిర్వహించడమే పెద్ద పనిలా తయారైంది. మిగిలిన విద్యా సమస్యల పరిష్కారంలో లేని ఉత్సాహం, యాజమాన్య కోటాలో , స్పాట్ అడ్మిషన్లలో జరిగే ప్రవేశాల ర్యాటిఫికేషన్‌పై ఉన్నత విద్యామండలికి దృష్టి ఎక్కువైంది. విద్యార్థుల నుండి ప్రవేశపరీక్ష ఫీజుల రూపంలో వచ్చే నిధులను ఏ విధంగా వెచ్చించాలనే దృష్టి తప్ప మిగిలిన అంశాలపై కౌన్సిల్ చైతన్యవంతంగా పనిచేయడం లేదనే అపవాదును ఎదుర్కొంటోంది. యూనివర్శిటీలను గాడిలో పెట్టాలంటే స్వయంప్రతిపత్తి అడ్డం వస్తోంది. బోధన సిబ్బంది హాజరు గణనీయంగా పడిపోవడం , విద్యార్థులు సైతం మొక్కుబడిగా తరగతులకు హాజరుకావడం గుర్తించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. యూనివర్శిటీల్లో హాస్టళ్ల సమస్యలు, ఏళ్ల తరబడి తిష్ట వేసిన విద్యార్థులను ఖాళీ చేయించాలంటే సరైన అధికారాలు వినియోగించలేని నిస్సహాయతతో యూనివర్శిటీలు గాడి తప్పుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారుడిగా రాజీవ్ శర్మను నియమించినా, ఆయనకు నేరుగా విద్యాశాఖ బాధ్యతలు అప్పగించకపోవడంతో విద్యాశాఖకు సలహాదరుడు లేకుండా పోయారు. ఇంధన శాఖకు, సంక్షేమానికి, సంస్కృతికి, ఆర్ధిక శాఖకు, అంతర్‌రాష్ట్ర సంబంధాలకు, మైనార్టీ సంక్షేమానికి, ఆర్ అండ్ బీకి, ప్రణాళికకు, హోం శాఖలకు సలహాదారులను నియమించిన ప్రభుత్వం విద్యాశాఖకు మార్గదర్శిని నియమించకపోవడం విడ్డూరం. ఇటీవల వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో ఫీజుల వ్యవహారం, రీయింబర్స్‌మెంట్ వ్యవహారం, టీచర్ల సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, క్రమబద్ధీకరణ తదితర అంశాలన్నింటినీ ఒకరి చేతులు మీదుగా నిర్వహించేందుకు పాలనాపరమైన అనుభవంతో పాటు విద్యారంగంపై గట్టి పట్టు ఉన్న వారిని సలహాదారుగా నియమిస్తే తెలంగాణ విద్యాశాఖనూ ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేందుకు వీలుందని చెబుతున్నారు. అన్ని శాఖలకూ మంత్రులు ఉండగా, సలహాదారులను నియమించినపుడు విద్యాశాఖకు సైతం సమర్థుడైన వ్యక్తిని సలహాదారుగా నియమించడం వల్ల మరిన్ని సత్ఫలితాలను సాధించేందుకు వీలుందని చెబుతున్నారు. ప్రభుత్వ యూనివర్శిటీలకు 12 బీ గుర్తింపును సాధించడంలో ఆయా వర్శిటీల వీసీలు విఫలమైనా స్నాతకోత్సవాలను నిర్వహించాల్సిన అనివార్యపరిస్థితి ఏర్పడింది. స్వతంత్రంగా ఆయా వీసీలు ఏమీ చేయలేని దుస్థితి, వారికి సరైన సహకారం అందించే వ్యవస్థ లేకపోవడంతో విద్యారంగం గాడితప్పుతోంది. డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు దోస్త్ నోటిఫికేషన్ జారీ చేసే సరికి, ఇంటర్ ఫలితాలు వెలువడలేదు, దాంతో ఇప్పటికే నాలుగుమార్లు దోస్త్ అడ్మిషన్లు చేపట్టినా, ఐదో విడత ఆన్‌లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెకండరీ టీచర్లుగా పనిచేస్తున్న వారికి డైట్‌లలో, ఐఎఎస్‌ఈ, జూనియర్ కాలేజీల్లో పదోన్నతులపై పెద్ద వివాదమే నడుస్తోంది, ఇంకో పక్క జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులు, డిగ్రీ లెక్చరర్ల పదోన్నతులపై కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపంతో తీవ్ర జాప్యం జరిగి ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండానే రిటైర్ కావల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఏడు వర్శిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తున్న తరుణంలో సలహాదారునూ నియమిస్తే సగం సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే భావన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై ప్రశ్నించినపుడు ఉస్మానియా మాజీ వీసీ ప్రొ. టీ తిరుపతిరావు సానుకూలంగా స్పందించారు. సమన్వయకర్త ఉన్నపుడు సమస్యలు తొందరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.