తెలంగాణ

ఉచిత దహన సంస్కారాలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 10 : మనిషి జననం నుండి.. మరణం వరకు ప్రజలకు కనీస అవసరాలను తీర్చాలన్నదే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని మాజీ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా గుర్రాల గొంది గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆచరణలో చూపేట్టింది. నిరుపేద కుటుంబంలో వ్యక్తి మృతిచెందితే..అంతిమ సంస్కారాలకు డబ్బులు భారం కావటంతో కుటుంబ సభ్యులు మోయలేక అప్పుల పాలవుతున్నారు. ఈవిషయాన్ని గమనించిన మాజీ మంత్రి హరీష్‌రావు గ్రామంలో పేదలు మృతిచెందితే ఆ కుటుంబ సభ్యులకు భారం కావద్దని తవనంతుగా కొంత ఆర్థిక సహాయం చేయటంతో పాటు, ప్రజాప్రతినిధులు ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. అయినప్పటికి నియోజక వర్గంలోని చాల గ్రామాల్లో నిరుపేద కుటుంబంలో వ్యక్తి మృతిచెందితే దహన సంస్కారాలతో పాటు, పెద్ద కర్మ వరకు ఆ కుటుంబానికి ఖర్చు తడిసి మోపేడు అవుతుండటంతో వారికి భారంగా మారుతుంది. దీంతో గ్రామంలో పేదలు మృతిచెందితే దహన సంస్కారాలు ఉచితంగా నిర్వహించాలని, ఇందుకు గ్రామపంచాయతీ పాలక వర్గం ముందుకు రావాలని, ఇందుకోసం గ్రామపంచాయతీ నిధులు సేకరించాలని ఇటివల నియోజక వర్గం ప్రజాప్రతినిధుల దిశా,నిర్దేశం చేశారు. గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆంజనేయులు చొరవతో ముందుకు వచ్చి గ్రామంలో ఉచిత దహన సంస్కారాలు నిర్వహించేందుకు నిధులు సేకరించారు. ఎమ్మెల్యే హరీష్‌రావు,సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ ఆకుల హరీష్, జడ్పీటీసీ, ఎంపీపీలు, గ్రామంలోని ముఖ్యమైన వ్యక్తుల ద్వారా 8లక్షల రూపాయలు నిధులు సేకరించారు. ఈ నిధులను బ్యాంకులో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీ డబ్బులతో పేదకుటుంబాల్లో వ్యక్తి మృతిచెందితే భారం కాకుండ 10వేల నుండి 15వేల రూపాయలు వెచ్చించి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సంకల్పించారు. ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది గ్రామం నుం శ్రీకారం చుట్టారు. శనివారం మహిళ అంత్యక్రియలను ఉచితంగా నిర్వహించిన తొలి గ్రామంగా గుర్రాలగొంది చరిత్రకెక్కింది.
గౌరవంగా మహిళ అంతిమ సంస్కారాలు
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు గ్రామంలో ఉచితంగా దహన సంస్కారాలు నిర్వసించి గుర్రాల గొంది గ్రామపంచాయతీ పాలక వర్గం ఆదర్శంగా నిలిచారు. ఆదివారం గ్రామానికి చెందిన కంకణాల చంద్రవ్వ (85) మృతిచెందగా గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, పాలక వర్గం దగ్గర ఉండి అంతిమ యాత్రలో పాల్గొని దహన సంస్కారాలు నిర్వహించారు. సర్పంచ్ ఆంజనేయులుతో పాటు, వార్డు సభ్యులు పాడే మోసి ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉచిత దహన సంస్కారాలు అంటే డబ్బులు ఇవ్వటం కాదని, పాలక వర్గం దగ్గర ఉండి దహన సంస్కారాలు నిర్వహించటమని చాటి చెప్పి, స్ఫూర్తిని చాటుకున్నారు. గుర్రాలగొంది నుండి ఉచితంగా, గౌరవంగా దహన సంస్కారాలు నిర్వహించి తొలి గ్రామంగా సిద్దిపేట జిల్లా మరోసారి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.