తెలంగాణ

18న రాజధానిలో బీజేపీ భారీ బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ఈ నెల 18వ తేదీన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్‌కు వస్తున్నారని, ఎగ్జిబిషన్ మైదానంలో బ్రహ్మాండమైన బహిరంగ సభను నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. టీడీపీ ఖాళీ అవుతుందని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం తారాస్థాయికి పెరిగిందన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బీజేపీపై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. తమకు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్‌కుమార్ విఫలమయ్యారన్నారు. కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షాపై విమర్శలు చేసే స్థాయి ఉత్తమ్‌కు లేదన్నారు. గాంధీ భవన్‌ను అమ్ముకునే స్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పని చేస్తోందాన్నరు. తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత వెంకటస్వామి కుమారుడు మాజీ ఎంపీ జీ వివేక్ బీజేపీలో చేరారంటే , ప్రజల్లో తమకు పెరిగిన ఆదరణకు బలమైన సంకేతమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సచివాలయాన్ని వీలైనంత త్వరగా కూల్చడంపై ఉన్న దృష్టి ప్రజా సంక్షేమ విధానాలపై లేదన్నారు.రైతు బంధు స్కీంను గాలికి వదిలేశారన్నారు. వర్షాలు పడినా, రైతులకు రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల స్కీం ముసుగులో కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. ప్రజలు రెండోసారి అధికారం అప్పగించారన్న విశ్వాసంతో సంక్షేమ రంగంపై దృష్టి పెట్టాలని ఆయన టీఆర్‌ఎస్ సర్కార్‌ను కోరారు. రాష్ట్రంలో బీజేపీ ఇంతవరకు 10 లక్షల మందికి కొత్తగా సభ్యత్వం ఇచ్చిందన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ రాష్ట్రంలోనే పార్టీ సభ్యత్వం తీసుకుంటారన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ పాలనను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి ఉందని ఆయన చెప్పారు.