క్రైమ్/లీగల్

సెంగార్‌ను తప్పించే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి హత్యకేసు నుంచి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్, అతడి సోదరుణ్ని సీబీఐ రక్షిస్తోందని న్యాయవాదులు ధర్మేంద్ర మిశ్రా, పూనమ్ కౌషిక్ ఆరోపించారు. ఈమేరకు జిల్లా జడ్జి ధర్మేంద్ర శర్మ ఎదుట హాజరై సీబీఐపై ఫిర్యాదు చేశారు. కుల్‌దీప్ అతడి సోదరుడ్ని ఉద్దేశపూర్వకంగానే కేసు నుంచి తప్పించే ప్రయత్నం సీబీఐ చేస్తోందని బాధితురాలి తరఫున్యావాదులు అన్నారు. సీబీఐ తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ భర్తేండు వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తులో ఎలాంటి వివక్షా లేదని చెప్పారు. దర్యాప్తు అధికారి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారని, విచారణ స్వేచ్ఛగా సాగుతోందని కోర్టుకు తెలిపారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరగడం లేదని ఆయన తెలిపారు. 2018లో ఆయుధ చట్టం కింద అరెస్టయిన అత్యాచార బాధితురాలి తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మొత్తం పది మందిపై అభియోగాలు నమోదయ్యాయి. సెంగర్ అతడి సోదరుడు అతుల్ సింగ్ సెంగార్, ముగ్గురు యూపీ పోలీసు అధికారుల పేర్లు చార్జిషీట్‌లో పొందుపరిచారు. కేసును తప్పుదోవపట్టించేందుకే సీబీఐ రెండు చార్షిషీట్లు దాఖలు చేసిందని బాధితుల తరఫున్యాయవాదులు ఆరోపించారు.