క్రైమ్/లీగల్

ఢిల్లీలో తొలి తలాక్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముమ్మారు తలాక్‌ను రద్దు చేసినప్పటికీ అందుకు పాల్పడి భార్యకు విడాకులిచ్చిన ఒక వ్యక్తిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. ముమ్మారు తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరమంటూ తాజా చట్టం నిర్దేశిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. ఉత్తర ఢిల్లీలోని బారాహిందూరావు పోలీస్ స్టేషన్‌లో 30 ఏళ్ల మహిళ తలాక్‌కు సంబంధించి తన భర్తపై శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రే అతనిని అరెస్టు చేశామని, శనివారం అతనికి బెయిల్ లభించిందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వివరించారు. జూన్ 23న ఈ 39 సంవత్సరాల వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పాడని, అంతేకాకుండా వాట్సాప్‌లో ఫత్వాను కూడా పంపినట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ నూకూర్ ప్రసాద్ వివరించారు. ముస్లిం మహిళలు (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం కింద ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు. ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హ నేరమంటూ ఆగస్టు 1న పార్లమెంటు ఓ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్ నేరానికి సంబంధించి దేశ రాజధానిలో నమోదైన తొలి కేసు ఇదేనని డీసీపీ తెలిపారు. వీరిద్దరికీ 2011లో పెళ్లయిందని, ఉత్తర ఢిల్లీలోని కమలా మార్కెట్‌లో ఆమె భర్త ఓ దుకాణం నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, కొంతకాలంగా వరకట్నం కోసం తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తూ వస్తున్నారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్ 28న తన భర్త, ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి ఓ పథకం ప్రకారమే ముమ్మారు తలాక్ చెప్పించారని ఆమె ఫిర్యాదు చేసింది. అది జరిగిన వెంటనే ఆరేళ్ల కుమారుడితో బయటకు వెళ్లిపోమని కూడా తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.