జాతీయ వార్తలు

వివాదంలో హర్యానా సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/చండీగఢ్ , ఆగస్టు 10: హర్యానా ముఖ్యమత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కాశ్మీరీ యువతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హర్యానాలోని స్ర్తి,పురష జనాభా నిష్పత్తిని దృష్టిలో పెట్టుకుని శుక్రవారం నాడు ఫతేహాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కట్టర్ వివాదాస్పద ప్రకటన చేశారు. సీఎం వంటి బాధ్యగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ జాతీయ మహిళా కమిషన్ మండిపడింది.
తక్షణం వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఆదేశించారు. వివాదానికి వివరాలు ఇలా ఉన్నాయి. ఫతేహాబాద్‌లో శుక్రవారం ఓ కార్యక్రమం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ దానికి హాజరయ్యారు. రాష్ట్రంలో స్ర్తి, పురుషుల జనాభా నిష్పత్తిపై కట్టర్ మాట్లాడుతూ నోరుజారారు. ‘రాష్ట్రంలోని యువకుల చూపుకాశ్మీర్‌పై పండింది. అక్కడి అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ మాటలు నాతో పలువురు అన్నారు’ అని ఖట్టర్ చెప్పుకొచ్చారు. ఇది జోకులా ఉన్నప్పటికీ హర్యానాలో స్ర్తిల జనాభా బాగా తగ్గిన దృష్ట్యా సమజంలో సమతుల్యతకు తప్పదేమో అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన ఖట్టర్ అవికాస్తా వివాదం కావడంతో మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. సీఎం ఖట్టర్ వ్యాఖ్యలు దుర్మార్గం, నీచమైనవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
తాను యధాలాపంగా ఆ వ్యాఖ్యలు చేసేనే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని ముఖ్యమంత్రి నష్టనివారణకు దిగారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై దుమ్మెత్తిపోయడంతో వివరణ ఇచ్చుకున్నారు. ‘కుమార్తెలో మన గౌరవం, వారిని చూసి గర్వపడదాం. దేశంలోని అమ్మాయిలందరూ కుమార్తెలతో సమానం’అని ఖట్టర్ ట్వీట్ చేశారు. రాహుల్ తనపై చేసిన విమర్శలను సీఎం తిప్పికొట్టారు. వక్రీకరించిన వార్తలను చూసి తనపై ఆరోపణల చేయడం తగదని ఆయన ధ్వజమెత్తారు. రాహుల్‌పై ట్విట్టర్‌లో మండిపడ్డారు.
‘డియర్ రాహుల్ జీ వక్రీకరించిన వార్తలు చూసి స్పందించడమేనా? మీ స్థాయికి తగునా. ఆ కార్యక్రమంలో నేను ఏం మాట్లాడిందీ ఒరిజనల్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. దాన్ని చూసి అప్పుడు విమర్శలు చేయండి’అని ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. పతేహాబాద్‌లో ఓ సభలో మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల కంటే తక్కువ. ఈ విషయం పెద్దలు, యువత గమనించారు. మా పార్టీ నేత ఓపి ధన్‌కార్జి తాము అమ్మాయిల కోసం బిహార్ వెళ్తున్నట్టు చెప్పారు’అని ఖట్టర్ అన్నారు. ‘ అలాగే కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయింది కాబట్టి అక్కడికి వెళ్లి యువతులను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చని నాతో కొందరు అన్నారు. అవే మాటలు నేను ప్రస్తావించాను’అని ఖట్టర్ అనేశారు. 2014లో హర్యానా మంత్రి ఓపీ ధన్‌కార్జి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. హర్యాలో అబ్బాయిలకు రాష్ట్రంలో సరైన జోడీ దొరక్క అమ్మాయిల కోసం బిహార్ వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని చెప్పారు. అమ్మాయిలు పురుషుల ఆస్తి కాదని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం ఖట్టర్ వివరణ ఇవ్వాలని ఆమె ఆదేశించారు.