జాతీయ వార్తలు

కోలుకుంటున్న కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 19: జమ్మూ-కాశ్మీర్ క్రమంగా కుదుటపడుతోందని, శాంతి-భద్రతల ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి సంఘటనలు జరగలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. క్రమంగా పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని, ముఖ్యంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో కూడా శాంతి-భద్రతలు బలపడుతున్నాయని ప్రభుత్వ సీనియర్ అధికారి సయ్యద్ అస్గర్ సోమవారం నాడిక్కడ మీడియాకు తెలిపారు. కర్ఫ్యూను సడలించినప్పటికీ ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదని, ఆంక్షలను మరింతగా సడలించిన నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలు మామూలుగా పని చేస్తున్నాయని, టీచర్లు, విద్యార్థుల హాజరీ కూడా సంతృప్తికరంగా ఉందని ఆమె తెలిపారు. అయితే కాశ్మీర్ పరిస్థితికి సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొన్ని శక్తులు ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని, వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆమె ఉద్ఘాటించారు. కొంత అసౌకర్యం కలుగుతున్నప్పటికీ ప్రజలు అధికారులతో సహకరిస్తున్నారని, శాంతి-్భద్రతల ఉల్లంఘనలకు పాల్పడుతున్న దాఖలాలు కూడా ఎక్కడా చోటు చేసుకోలేదని డీఐజీ బీకె బిరిదీ తెలిపారు. ముఖ్యంగా ఆంక్షలు అమలవుతున్న చోట్లా వాటిని సడలించిన ప్రాంతాల్లో కూడా ఈ రకమైన సంఘటనలు ఏవీ జరగలేదని వెల్లడించారు. అయితే కొన్ని చోట్ల రాళ్ళు రువ్విన సంఘటనలు జరిగినప్పటికీ అల్లరి మూకలను పోలీసులు తరిమి కొట్టారని అన్నారు. మొత్తం మీద పరిస్థితిని లోతుగా గమనిస్తున్నామని, నిఘా పరంగా ఎక్కడా తొట్రుపాటు లేకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పారు. శ్రీనగర్‌లో ఉన్న 190 ప్రాథమిక పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, భద్రతా దళాలను ఎక్కువగా కాశ్మీర్ లోయ ప్రాంతంలోనే మోహరించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తెరిచినప్పటికీ దాడుల భయంతో ప్రైవేటు పాఠశాలలు 15వ రోజున కూడా తెరచుకోలేదని, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు ఇంకా భయపడుతున్నారని ఆయన తెలిపారు.
బారాముల్లా, సోపో సహా పలు పట్టణాల్లో ఎలాంటి సడలింపు లేకుండా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా శ్రీనగర్‌లో శాంతి-యుతంగా ఉన్న ప్రాంతాల నుంచి బ్యారికేడ్లను తొలగించి సాధారణ పరిస్థితులు పాదుకునేందుకు అధికారులు వీలు కల్పిస్తున్నారు.