రాష్ట్రీయం

దమ్ముంటే..నిరూపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కూకట్‌పల్లి, ఆగస్టు 19: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు దమ్ముంటే నిరూపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుసవాల్ చేశారు. ‘ఇది తెలంగాణ బిడ్డల అడ్డా. కర్నాటక తరహాలో ఆటలు ఇక్కడ సాగవు’అని కేటీఆర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ‘ఆయనెవరో నిన్నటి వరకు తెలియదు. అవాస్తవాలు మాట్లాడటంతో తెలిసింది. నడ్డా తన పేరు అబద్దాలకు అడ్డాగా మార్చుకుంటే మంచిది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే కడుపు మండుతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు’ అని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే
కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను కట్టుకోవడానికని కేటీఆర్ స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలో సోమవారం జరిగిన పార్టీ డివిజన్, బూత్ కమిటీల సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగించారు. హైదరాబాద్‌లో జరిగిన సభలో బీజేపీ నేత నడ్డా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘అవినీతి..అవినీతి అని గొంతు చించుకోవడం కాదు, దమ్ముంటే నిరూపించండి. ఆధారాలు చూపండి’అని సవాల్ చేశారు. గత ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ నేతలు ఇలానే మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. ఒకాయన అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశారని, టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చినా ఆయన గడ్డం మాత్రం అలాగే ఉండిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మంచి పనులు చేయడం వల్లనే మళ్లీ అధికారంలోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు, హైదరాబాద్‌కు ఒక్కటైనా మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ చేస్తోన్న దుషచ్రారం, కుట్రలు, కుతంత్రాలను టీఆర్‌ఎస్ శ్రేణులు గట్టిగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నాటక తరహా రాజకీలను ఇక్కడ చేస్తామంటే కుదరదని తగిన బుద్ధి చెప్పాలన్నారు. కుల, మత రాజకీయాలు చేస్తామంటే తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఓ వైపు ప్రశంసిస్తుంటే, బీజేపీ నేతలు వచ్చి విమర్శలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇందులో ఎవరు కరెక్టో ఆలోచించుకోవాలని కేటీఆర్ హితవుపలికారు. రాష్ట్రం బాగుపడుతుంటే, పొలాలు పచ్చగా ఉంటే, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే, ప్రాజెక్టులు కట్టుకుంటే కొన్ని పార్టీలకు నచ్చడం లేదని విమర్శించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పేర్లు మార్చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వాలతో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ నుంచి కేవలం ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి ఆ పార్టీ నేతలు ఎగిసి పడుతున్నారని విమర్శించారు. బీజేపీలో బాధ్యతగల నాయకులు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఏదంటే అది మాట్లాడితే ప్రజాక్షేత్రంలో పుట్టగతలు ఉండవని హెచ్చరించారు.

చిత్రం...కూకట్‌పల్లిలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్