జాతీయ వార్తలు

మోదీ, షాకు చెప్పే చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, పీపీఏల పునఃపరిశీలన విషయంలో ప్రధాన మంత్రి మోదీతో కూలంకషంగా చర్చించిన తరువాతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. విజయసాయిరెడ్డి బుధవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ‘ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో సంప్రదింపులు జరిపిన తరువాతే తీసుకుంటున్నారు’అని స్పష్టం చేశారు. పోలవరం రీటెండరింగ్, పీపీఏ వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంత దుష్ప్రచారం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఖజానాను గొల్లగొట్టారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో
పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి, ఆస్తులు కూడగట్టుకున్నాన్న వారందర్నీ చట్ట పరిధిలోకి తీసుకరావాలనేదే తమ దృఢ సంకల్పమన్నారు. అవినీతి నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పాన్ని ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సమర్ధించారని విజయసాయి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వారిద్దరి మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా పోలవరం రివర్స్ టెంటరింగ్. పీపీఏ అంశాల్లో ప్రధాని మోదీతో చర్చించాకే సీఎం జగన్ ముందుకెళ్లారని ఆయన పునరుద్ఘాటించారు.దీనిపై ఎటువంటి సందిగ్ధం, గందరగోళానికి తావులేనని వైసీపీ నేత అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చేస్తారంటూ ప్రచారంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘రాజధాని మార్పుపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీడియాకు చెబుతుంది’అని వివరించారు. రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనప్పుడు దానిపై చర్చించడం అనవసరమని ఆయన తేల్చేశారు. ఏపీ రాజధాని అమరావతిని తరలించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు. రాజధాని ముంపునకు గురవుతున్న మాట వాస్తవమని ఆయన చెప్పారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినపుడు కొండవీటి వాగు వల్ల రాజధాని అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు. ముంపును నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వరదలపై మాజీ మంత్రి లోకేష్ ట్వీట్లు అవగాహనతో చేస్తున్నట్టు లేదని, ఆయన కార్యాలయ సిబ్బంది పనిలా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యాటనలో ఉన్నప్పటికి వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు.

చిత్రం... వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి