రాష్ట్రీయం

అంతా ప్రభుత్వ సృష్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఆగస్టు 21: రాష్ట్ర ప్రభుత్వం తన ఇంటిని ముంచడానికే వరదలు సృష్టించిందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. వరద నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా పేదలు, రైతులు, తీరని నష్టాన్ని చవిచూశారని, బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని కృష్ణాపరివాహక ప్రాంతాలలో ముంపునకు గురైన లంక గ్రామాలను చంద్రబాబునాయుడు బుధవారం సందర్శించి రైతులు, బాధితులను పరామర్శించారు. తెనాలి మీదుగా భట్టిప్రోలు మండలం వెల్లటూరు నుండి చింతమోటు, పెసర్లంక గ్రామాలను పరిశీలించిన ఆయన జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. అనంతరం కొల్లూరు మండలం తడికలపూడి, కిష్కింధపాలెం, జువ్వలపాలెం, గ్రామాలలో పర్యటించి ముంపునకు గురైన గృహాలు, పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం వరద నీటిని నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం కరకట్టపై ఉన్న తన ఇంటిని ముంపునకు గురిచేసి అక్కడి నుండి తొలగించే కుట్రలో భాగంగానే కృష్ణాపరివాహక ప్రాంతాలకు వరదముంపు తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. అంచెలంచెలుగా నీటిని కిందకు వదిలితే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. వారం రోజులుగా పంటలు, గృహాలు నీటిలో నానుతున్నప్పటికీ నష్టం అంచనాలు సిద్ధం చేయకపోవటం దారుణమన్నారు. ఈ ఖరీఫ్‌లో ఎకరాలకు లక్ష రూపాయల వరకు ఖర్చుచేసి పంటలు వేసిన అన్నదాతలు ముంపు కారణంగా పూర్తిగా నష్టపోయారన్నారు. వరితోపాటుగా వాణిజ్య పంటలు కూడా వరద ముంపులో నానిన కారణంగా అన్నదాతలకు పెద్దదెబ్బే తగిలిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం తమ స్వార్థం కోసం కుట్రలుపన్ని పేదప్రజలు, రైతులకు నష్టం తీసుకురావటం కక్షసాధింపు చర్యగా ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినా ప్రజల సంక్షేమం, అభివృద్ధివైపు రాష్ట్రాన్ని నడిపించాలిగానీ కక్షలు, కార్పణ్యాలతో పరిపాలన సాగించడం సమంజసం కాదని హితవు పలికారు. ముందస్తుగా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల పైనుండి వస్తున్న వరదను అంచనా వేసి కిందకు నీరు విడుదలచేసినట్లయితే లంక గ్రామాలకు ఇంత భారీ నష్టం వాటిల్లేది కాదన్నారు. మంత్రుల
ఆవగాహన లోపం, ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు కారణంగా నేడు కృష్ణాపరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు తీరని నష్టాన్ని చవిచూశారని ఆయన ఆరోపించారు. తొలుత తెనాలిలో చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలికిన మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు ఆయనను లంక గ్రామాలకు తోడ్కొని వెళ్లారు. ఉదయం 10గంటలకు పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు భట్టిప్రోలు మండలం వెల్లటూరు చేరుకున్న చంద్రబాబునాయుడి కార్యక్రమాలకు సుమారు 2గంటల పాటు వర్షం ఆటంకం కల్పించింది. అనంతరం కొల్లూరు మండలంలోని లంకగ్రామాల్లో ఆయన పర్యటించి చీకటి పడటంతో వెనుదిరిగారు.
చిత్రం... పంట నష్టం వివరాలు తెలుసుకుంటున్న చంద్రబాబునాయుడు