ఆంధ్రప్రదేశ్‌

అలిపిరి నడక దారిలో టీటీడీ చైర్మన్ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 15: తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో ఉన్న దుకాణాలను, మరుగుదొడ్లను టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మరుగుదొడ్ల లోపల బయట బ్లీచింగ్ చల్లాలని అధికారులను ఆదేశించారు. నడక మార్గంలోని సౌకర్యాల గురించి పలువురు భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అసౌకర్యం కలిగితే వెంటనే తన కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఆహారపదార్థాలను శుచిగా ఉంచాలని, ఎమ్పార్పీ ధరలకే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
రవిశంకర్ గురూజీని కలిసిన టీటీడీ చైర్మన్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీని ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో కలిశారు. ఈసందర్భంగా ఆయనకు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రవిశంకర్ అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మికవేత్త అన్నారు. ఆయన ఉపన్యాసాలు వింటే మనసు నిలకడగా ఉంటుందన్నారు.
*చిత్రం... తిరుమల నడకమార్గంలో మరుగుదొడ్లను పరిశీలిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి