ఆంధ్రప్రదేశ్‌

ప్రమాదానికి గురైన బోటు పర్యాటక శాఖది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: గోదావరిలో ప్రమాదానికి గురైన బోటుకు రాష్ట్ర పర్యాటక శాఖకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా పర్యాటక శాఖకు చెందిన అన్ని బోట్లను వారం రోజుల క్రితమే నిలిపివేశామన్నారు. ప్రస్తుత ప్రమాదం నేపథ్యంలో పర్యాటక శాఖ జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తోందని, ఇప్పటికే తమ హరిత, ఆర్థర్ కాటన్ పడవులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఆయన తెలిపారు. బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటిన రంగంలో దిగిందని, మరో రెండు స్పీడ్ బోట్లు కూడా రాజమండ్రి నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ప్రవీణ్‌కుమార్ వివరించారు.