జాతీయ వార్తలు

‘అవినీతి శకం’ ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశంలో ‘అవినీతి శకం’ ముగిసిపోయిందని, సుపరిపాలన, సంఘటిత వృద్ధి, పేదలకు సేవ దశ మొదలయిందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రాంపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అయిదేళ్ల క్రితం దేశ ప్రజలు నరేంద్ర మోదీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు ‘అవినీతి చాంపియన్లు’ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తూ ఉండినారని, మధ్య దళారులు ‘సమాంతర ప్రభుత్వాన్ని’ నడుపుతూ ఉండినారని ఆయన అన్నారు. ‘కాని, ఇప్పుడు అవినీతి చాంపియన్లు, పవర్ బ్రోకర్లు, మధ్య దళారులు జైలులో ఉండటమో లేదా తమ వంతుకోసం జైలు తలుపుల బయట వేచి ఉండటమో జరుగుతోంది’ అని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నక్వీ అన్నట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అవినీతిపరులలో ఏర్పడిన వ్యాకులతయే మారిన సానుకూల వాతావరణం, పారదర్శక వ్యవస్థకు నిదర్శనమని నక్వీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహంకార రాజకీయ సంస్కృతిని నిర్మూలించడం ద్వారా సుపరిపాలన, పేదలకు సేవ అనే తన వాగ్ధానాలను నెరవేర్చారని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం వరుసలో చివరన ఉన్న వ్యక్తి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో భారీ సానుకూల మార్పును తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని ఈ దశను ‘మోదీ విప్లవం’గా ప్రపంచం గుర్తించిందని నక్వీ అన్నారు.