ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ వారే కేసులు పెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 17: నవ్యాంధ్ర మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతికి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలే కారణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడెల మృతిని అడ్డం పెట్టుకుని లబ్ధిపొందాలని చంద్రబాబు చేస్తున్న నీచమైన ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై ప్రభుత్వం గానీ, వైసీపీ నేతలు గానీ కేసులు పెట్టలేదని, టీడీపీ నేతలే 19 కేసులు నమోదు చేయించారన్న విషయాన్ని గుర్తుచేశారు. కోడెల కుటుంబ సభ్యులు హైకోర్టు నుండి స్టే కూడా తెచ్చుకున్నారని తెలిపారు. కోడెల మృతిని సీఎం జగన్మోహనరెడ్డికి ఆపాదించడం సరికాదన్నారు. కోడెల వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది, ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తామంటూ చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. కోడెలతో తనకు గానీ తమ పార్టీకి గానీ వ్యక్తిగత శతృత్వం లేదని, రాజకీయపరంగా మాత్రమే ఆయన తమ ప్రత్యర్థి అని స్పష్టంచేశారు. కోడెల చనిపోయే ముందు 20 నిముషాలు ఎవరితోనో మాట్లాడారని, అవి బహిర్గతమైతే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంబటి పేర్కొన్నారు.