Others

పుస్తకాలు అలవాటు చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి తరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ గిరగిరా తిరుగుతుంటాయి. పిల్లలకు చదివే అలవాటు ఎలా చేయాలన్నదే నేడు పెద్దలకు దిక్కుతోచని సమస్యగా మారింది. పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి. ఇలా జరగాలంటే వారితో పాటు తల్లిదండ్రులు కూడా పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి. మంచి పుస్తకం ఆత్మీయుడైన స్నేహితుడిలాంటిది. వయసుకి తగినట్లు పిల్లలకు మంచి పుస్తకాలను సమకూర్చాలి. పుస్తకాలు లేని ఇల్లు, కిటికీలు లేని గది ఒక్కటే.. పిల్లలందరూ కలిసి సరదాగా చదువుకున్నా, వారితో పాటు పెద్దలు కూడా కూర్చుని చదువుకున్నా ఆనందమే.. చదివేటప్పుడు అర్థం కాని విషయాల్ని, పదాల్ని పిల్లలు అడిగినప్పుడు విసుక్కోకుండా వివరించి చెప్పాలి. అలా పిల్లలకు సమాజంలో జరుగుతున్న మంచి-చెడులను తెలియజెప్పాలి. పత్రికలు చదివే అలవాటు చేయాలి. ఇప్పుడు దినపత్రికల్లో పిల్లలకోసం ప్రత్యే పేజీలు వస్తున్నాయి. చదువుకు సంబంధించినవీ, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కూడా.. అలాగే పజిల్స్ కూడా.. పిల్లలకు రోజుకో పజిల్‌ను ఇచ్చి చేయమనాలి. మనం కూడా వారితో పాటు కూర్చుని ఒక పజిల్‌ను చేయాలి. ఇలా చేయడం వల్ల వారికి చురుకైన మెదడు సొంతం అవడంతో పాటు పాఠాల్లోని లెక్కలు కూడా త్వరగా చేయగలుగుతారు. మార్కెట్లో ఇలాంటి తరహా పజిల్స్ బోలెడన్ని ఉంటాయి. వాటిని కొని తెచ్చి పిల్లలకు అందివ్వాలి.
స్మార్ట్ఫోన్‌లతో..
ఇటీవల ఎవరి ఇంట్లో చూసినా, ఏ పిల్లాడి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్‌లే దర్శనమిస్తున్నాయి. ఆటలు, వీడియోగేమ్స్, సినిమాలు, యూ ట్యూబులే వారి ప్రపంచాలయిపోయాయి. ఇది అంతర్జాల ప్రపంచం. మనం కోరుకున్నదాన్ని అరచేతిలో వీక్షించే సదుపాయం ఉంది. అలాంటి స్మార్ట్ఫోన్‌ను పిల్లలు ఆటలకు, సినిమాలకు ఉపయోగించకుండా చూడాలి. ‘మనం ఎప్పుడూ గాంధీజీ వంటి గొప్ప గొప్ప నాయకులను వ్యక్తిగతంగా కలుసుకోలేదు కదా.. ఇప్పుడు ఈ ఫోన్ ద్వారా వారిని కలుసుకుందాం’ అంటూ వారి విజయగాథలు, స్ఫూర్తి నింపే మాటలు, డాక్యుమెంటరీలను వారితో కలిసి చూస్తూ, వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేస్తుంటే మరింత సంతోషపడతారు పిల్లలు. అలాగే వ్యక్తిత్వ వికాస పాఠాలు, మంచి మంచి కథలను కూడా పిల్లలతో కలిసి ఇలాగే చూడవచ్చు.
విజ్ఞాన యాత్రలు
పిల్లలను విహార యాత్రలతో పాటు అప్పుడప్పుడూ విజ్ఞానయాత్రలకు కూడా తీసుకెళ్లాలి. అంటే జంతుప్రదర్శనశాలలు, మ్యూజియంలు, ప్లానిటోరియంలు ఇలాంటివి అన్నమాట. అక్కడ ఉపగ్రహాల పనితీరు, వాటి ప్రయోగాలు, సైన్స్‌కు సంబంధించిన వింతలు, విశేషాలను చూపించడం వల్ల వారు సైన్స్ సూత్రాల్ని బట్టీ పట్టించడం కాక పిల్లల్ని ఇలాంటి చోటికి తీసుకెళ్తూ ఉంటే వారికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఫలితంగా సొంతంగా ప్రయోగాలు చేయడం మొదలుపెడతారు.