సంపాదకీయం

సమైక్య మాధ్యమం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లింగమూర్తీ! ఇంకెన్నిసార్లు చెంపలేసుకుంటావు..?’ అని సోమయాజులు అన్నాడట!.. అన్నది గ్రామీణ ప్రాంతంలో అప్పుడప్పుడు వినబడే లోకోక్తి. చేయని పొరబాటుకు అనవసరంగా వివరణ ఇచ్చుకునే వారికి వర్తించే సామెత ఇది. దేశ వ్యవహారాల మంత్రి అమిత్ షాకు ఇప్పుడీ చతురోక్తి అన్వయం అవుతుండడం విచిత్రమైన వ్యవహారం. ‘హిందీ భాషను ఎవ్వరి నెత్తిన కూడ రుద్దబోవడం లేదు..’ అని అమిత్‌షా పదే పదే హామీ ఇస్తున్నారు. హిందీ కేంద్ర ప్రభుత్వ అధికార భాష- అన్నది రాజ్యాంగ వాస్తవం. హిందీ భాష సర్వసమగ్రంగా అధికార, అనుసంధాన భాషగా వ్యవహార రూపం దాల్చేవరకు మాత్రమే ‘ఆంగ్ల భాష’ కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా కొనసాగాలన్నది రాజ్యాంగ ఆదేశం. ఎప్పటికైనా దేశంలోని రాజ్యాంగ వ్యవస్థ నిర్వాహకులు అందరూ హిందీని నేర్చుకోవాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. అదే విషయాన్ని అమిత్ షా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా పునరుద్ఘాటించాడు! ‘హిందీని రుద్దడానికి’కానీ, ‘హిందీ భాషను ఆంగ్ల భాషకు ప్రత్యామ్నాయంగా రూపొందించడానికి’ కానీ అమిత్‌షా కొత్తగా చేసిన ప్రయత్నం లేదు. హిందీ పేరు చెబితేనే ఈ దేశంలో కొందరికి తేళ్లు పాములు కప్పలు ఎలుకలు పిల్లులు తమ దేహాలపై పారాడుతున్న ‘భ్రమ’కలుగుతోంది! ఈ కొందరు ‘ఈ దేశంలో రెండు జాతులు ఉన్నాయి..’ అని భ్రమిస్తున్నవారు! ‘ఆర్యజాతి, ద్రవిడ జాతి అన్నవి ఈ రెండు జాతులు. దక్షిణ భారతీయులు ద్రవిడ జాతి, ఉత్తర భారతీయులు ఆర్య జాతి. ఈ రెండు జాతుల వారు పరస్పరం కొట్టుకొని చచ్చారు! ఇలా కొట్టుకొని చావడమే ఈ దేశపు ప్రధాన చరిత్ర..’అని భ్రమిస్తున్నవారు హిందీని వ్యతిరేకిస్తున్నారు. ఈ అబద్ధాన్ని, ఈ కృతకమైన ద్విజాతి సిద్ధాంతాన్ని, కనిపెట్టి ప్రచారం చేసిపోయినవారు బ్రిటన్ నుంచి వచ్చి రెండున్నర శతాబ్దులు మన దేశాన్ని దోచుకొనిపోయిన దొంగలు! ఈ దొంగలే అంతవరకు దేశానికి అధికార భాష అయిన, అనుసంధాన భాష అయిన, ఉన్నత విద్యాబోధనకు మాధ్యమ భాష అయిన సంస్కృత భాషను తొలగించి తమ ఆంగ్లభాషను ఆ స్థానంలో ప్రవేశపెట్టిపోయారు. దొంగలు నిష్క్రమించిన తరువాతనైనా దొంగలు నెలకొల్పిన వ్యవస్థను నిర్మూలించి స్వజాతీయ భాషావ్యవస్థను పునరుద్ధరించుకోవడం ఏ దేశంలోనైనా సహజం. కానీ మన దేశంలో మాత్రం ఈ సహజ ప్రక్రియ వికసించకుండా బ్రిటన్ వారసత్వ ప్రతినిధులు అడ్డుతగులుతున్నారు. ఇలా అడ్డుతగులుతున్నవారు మాత్రమే హిందీని వ్యతిరేకిస్తున్నారు. హిందీ భారతీయ భాష. ఆంగ్లం బ్రిటన్‌వారు ‘రుద్దిన భాష’. హిందీని నేర్చుకోవాలని చెప్పడం ద్వారా అమిత్‌షా ఎలాంటి పొరబాటు చేయలేదు. కానీ వ్యతిరేకుల ఆర్భాటానికి ‘జడిసి’ ఆయన పదే పదే అనవసరమైన వివరణను ఇస్తున్నాడు, చెంపలు వేసుకొని గుంజీలు తీస్తున్నట్టు ప్రవర్తిస్తున్నాడు.. ఎందుకని?
దాదాపు రెండువందల ఏళ్లుగా మన దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆంగ్లభాషను భారతీయులెవ్వరూ స్వచ్ఛందంగా నేర్చుకోలేదు. బ్రిటన్ దురాక్రమణకారులు మనచేత నిర్బంధంగా ఆ భాషను చదివించడం చరిత్ర. ఆంగ్లభాష మన దేశంలోను, గతంలో బ్రిటన్ దురాక్రమితమైన అనేక దేశాలలోను ఆధిపత్యం వహిస్తుండడానికి కారణం దురాక్రమణ వారసత్వం. అన్ని భాషలూ చదువుల తల్లికి రూపాలు. ఆంగ్లం పట్ల కూడ ద్వేషం లేదు, ఆ భాషను భాషగా నేర్చుకోవచ్చు.. ఫ్రాన్స్‌వారి భాషను జర్మనీ భాషను జపానీ భాషను కూడ మనం నేర్చుకోవచ్చు, ప్రపంచంలోని అన్ని భాషలను కూడ మనం నేర్చుకుంటున్నాము. కానీ ఆంగ్లాన్ని మన దేశంలో కేవలం భాషగా నేర్పడం లేదు. ఆంగ్లేయ బీభత్స జాతీయ దురహంకార వారసత్వ భావజాలానికి ప్రచార మాధ్యమంగా ఆంగ్లభాష డెబ్బయి ఏళ్లుగా పెత్తనం చెలాయిస్తోంది! బ్రిటన్ దురాక్రమణ విముక్త దేశాలన్నింటిలోనూ విముక్తి తరువాత ఆయా స్వదేశీయ భాషలు అధికార భాషలు కావడం చరిత్ర! మన దేశంలో మాత్రం ‘్భరతీయ భాష’ మొత్తం దేశవ్యాప్తంగా అధికార భాషగా కానీ అనుసంధాన భాషగా కానీ ఉన్నత విద్యామాధ్యమ భాషగా కాని ఇంతవరకు వికసించకపోవడం మన జాతీయ సమష్టి భావదాస్యానికి చిహ్నం. హిందీని వ్యతిరేకిస్తున్నవారు దేశ ప్రజలకు సమాధానం చెప్పవలసిన ప్రశ్న ఒకటి ఉంది. ఆ ప్రశ్న- ఈ దేశానికి ఒక భారతీయ భాష అధికార భాషగా, అనుసంధాన భాషగా ఏర్పడాలా? వద్దా??
వద్దని సమాధానం చెప్పగలవారికి తాము భారతీయులమని, భరతమాత బిడ్డలమనీ చెప్పుకునే అధికారం, యోగ్యత ఉన్నాయా? ఉంటాయా?? ‘అవును.. ఒక భారతీయ భాష దేశానికి అధికార భాష కావాలి. ఆంగ్లం స్థానాన్ని అది పొందాలి, ఆంగ్లం కేవలం ఒక భాషగా బోధనకు నోచుకోవాలి, అది అధికార భాష కారాదు..’ అన్నది సమాధానం అయినట్టయితే ఆ భారతీయ భాష ఏది? అన్నది తరువాతి ప్రశ్న. ఎందుకంటె అన్ని భారతీయ భాషలూ ‘వ్రాత’కు నోచుకోక అంతరించిపోవడానికి రంగం సిద్ధమై ఉంది. శిశు-కిండర్ గార్టెన్- స్థాయి నుంచి ఆంగ్లమాధ్యమ బోధన దేశమంతటా అన్ని పాఠశాలలలోను జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలలోను, ప్రభుత్వేతర వాణిజ్య పాఠశాలలలో మాత్రమేకాదు జాతీయ నిష్ఠకల స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పాఠశాలలలో సైతం శిశువులకు ఆంగ్లం మాత్రమే నేర్పిస్తున్నారు. ఐదవ తరగతి తరువాతనే వారికి దేశ భాషల అక్షర పరిచయం కలుగుతోంది. పాఠశాల స్థాయిలో కేవలం ఒక ‘విషయం’- సబ్జెక్టుగా- ఒక భాషగా తెలుగునో, ఇతర భారతీయ భాషలనో నేర్పుతున్న ఈ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం తక్షణం మార్చాలి. పూర్వ శిశుస్థాయి నుంచి ఏడవ తరగతి వరకూ ప్రతి ప్రాంతంలోను ఆయా ప్రాంతీయ మాతృభాషల మాధ్యమంగా మాత్రమే బోధన జరగాలి. ఆంగ్లభాషను గతంలో వలె, బ్రిటన్ దురాక్రమణ సమయంలో వలె ఐదవ తరగతి నుంచి మాత్రమే నేర్పించాలి! బ్రిటన్‌వారు పాలించిన సమయంలో కూడ ఎనిమిదవ తరగతి నుంచి మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరిగేది. కానీ వారు వెళ్లిపోయిన తరువాత ‘పూర్వశిశు’స్థాయి నుంచి కూడ ఆంగ్లమాధ్యమ బోధన ఆరంభం కావడం దోపిడీ చేసిన వారిపట్ల మన విధేయతకు చిహ్నం. హిందీ అధికార భాష కావాలి? మరో భారతీయ భాష అధికార భాష కావాలి? అన్నది ప్రస్తుతం ప్రధాన సమస్య కాదు, మొత్తం భారతీయ భాషలు అంతరించిపోయి ‘ఆంగ్లం’ ఏకైక భాషగా- అమెరికాలో వలె-ఏర్పడే భయంకర విపత్కర స్థితిని నిరోధించడం ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం! అమెరికాలోని అనాది భాషలను ఐరోపావారు హత్యచేయడం క్రీస్తుశకం పదిహేడవ, పద్దెనిమిదవ శతాబ్దుల నాటి చరిత్ర.
అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణం నడుం బిగించాలి. పూర్వ శిశుస్థాయి పాఠశాల-కానె్వంటు- స్థాయి నుంచి ఏడవ తరగతి వరకు భారతీయ మాతృభాషల మాధ్యమంగా విద్యాబోధన జరగాలి- అన్ని ప్రాంతాలలోను అన్ని- ప్రభుత్వ, ప్రభుత్వేతర- పాఠశాలలలోను ‘ఆంగ్ల మాధ్యమ’బోధన అంతం కావాలి. తెలుగు నేలపై తెలుగు మాధ్యమంలోను ఇతర ప్రాంతాలలో ఆయా ప్రాంతీయ మాతృభాషల మాధ్యమంగాను ‘బుడుతల’కు విద్యను మప్పాలి. ఇందుకోసం ‘రాజ్యాంగ సవరణ’ జరగాలి. ఏడవ తరగతి తరువాత దేశమంతటా ఒకే భారతీయ భాష మాధ్యమంగా విద్యాబోధన జరగాలి. ఆ భారతీయ భాష సంస్కృత భాష! ఇలా విద్యావిధానం మారినట్టయితే ‘ఈ దేశంలో రెండుమూడు జాతులు లేవు, అనాదిగా కొలంబో నుంచి కైలాసం వరకు ఈ దేశం ఒకే జాతి..’ అన్న వాస్తవం మళ్లీ వెలుగుతుంది, వాస్తవ ధ్యాస విద్యావంతులలో పెరుగుతుంది. బ్రిటన్ దొరలు ‘సంస్కృత భాష’ను విద్యారంగం నుంచి, అనుసంధాన రంగం నుంచి, పాలన రంగం నుంచి తొలగించడానికి, సంస్కృత భాషలో జరిగిన అన్ని కార్యకలాపాలను ఆంగ్లంలో జరపడానికి అరవై ఏళ్లు పట్టింది. యథాపూర్వ స్థితిని పునరుద్ధరించడానికి, ఇప్పుడు ఆంగ్లంలో జరుగుతున్న కార్యకలాపాలు మొత్తం సంస్కృత భాషలో జరగడానికి కూడ ఇప్పటి నుంచి అరవై ఏళ్లు పట్టవచ్చు. ఈ దిశగా ఆరంభం జరిగితే భారతీయ భాషలన్నీ బతుకుతాయి, జాతీయ సాంస్కృతిక సమైక్యత మళ్లీ సిద్ధిస్తుంది.. రా జ్యాంగాన్ని సవరించండి!