క్రైమ్/లీగల్

ఆక్వా ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ .. ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 20: ఆక్వా ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలాన ఒకరు ప్రాణాలు విడవగా మరొకరి ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెయ్యలపాలెంలో ఉన్న అల్ఫా మెరైన్ ఆక్వా ఫ్యాక్టరీలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ అమ్మోనియా వాయువు లీకయింది. ఒక్కసారిగా గ్యాస్ బైటకు రావడం, అది విషపూరితం కావడంతో అక్కడున్న కార్మికులు శ్రీనివాసులు, సంజన అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. దీంతో తోటి కార్మికులు, యాజమాన్యం వారిని నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు (30) మృతి చెందాడు. సంజనకు చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితి గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు అమ్మోనియా వాయువు లీకేజీ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, కార్మిక శాఖ అధికారులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. విషవాయువు ఎలా లీకయిందనే విషయాలపై ఆరా తీశారు. ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా? .. అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.