జాతీయ వార్తలు

రోల్ మోడల్స్‌గా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య దూరం తొలగిపోయి మరింతగా అనుసంధానత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. 2017 బ్యాచ్‌కి చెందిన 169 మంది ఐఏఎస్ అధికారులు సోమవారం రాష్ట్రపతి భవన్‌లో తనను కలుసుకున్న సందర్భంగా కోవింద్ మాట్లాడారు. ఈ అధికారులంతా వివిధ శాఖల మంత్రులకు, విభాగాలకు కార్యదర్శులుగా నియమితమైనవారే. ఈ అధికారులంతా తమ బాధ్యతల నిర్వహణలో ప్రభుత్వ పథకాల గరిష్ట ప్రయోజనాలు సాకారమయ్యేలా దృష్టి పెట్టాలని రామ్‌నాథ్ అన్నారు. ఏవిధంగా ముందుకు వెళ్తే అత్యధిక స్థాయి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందో విశే్లషించుకోవాలని అన్నారు. ఎవరికి వారుగా పనిచేయడం కాకుండా ఉమ్మడి స్ఫూర్తితో ముందుకు సాగాలని, ప్రతిఒక్కరినీ కలుపుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని ఈ కొత్త ఐఏఎస్‌లకు ఉద్భోదించారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరి కృషికి, పనితీరుకు గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విధంగా ఆదర్శనీయంగా బాధ్యతలు నిర్వహించి ఓ రోల్‌మోడల్‌గా తమను తాము తీర్చిదిద్దుకోవాలని రాష్ట్రపతి కోరారు. అలాగే సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో ప్రజల ప్రమేయాన్ని మరింతగా పెంపొందించే అంశంపైనా తగిన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి, సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో ప్రజల పాత్రను పెంచాలని అన్నారు. పాలనా యంత్రాంగం అన్నది ‘మనది’, ‘వారిది’ అన్న భావన వీడి, మనందరిది అన్న స్ఫూర్తితో పనిచేయాలని ఈ అధికారులను రాష్ట్రపతి కోరారు. ఈ క్రమంలోనే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సామీప్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అధికారులు చేపట్టే చర్యలు, అనుసరించే విధానం ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవిధంగా, ప్రజా కేంద్రంగానే ఉండాలని పిలుపునిచ్చారు. ఏ పథకం సక్రమంగా అమలు కావాలన్నా ఐఏఎస్ అధికారుల పాత్రే కీలకం అని ఉద్ఘాటించిన రాష్ట్రపతి ‘ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించాలంటే ఐఏఎస్‌ల పాత్ర అత్యంత గురుతరం’ అని అన్నారు. ప్రజల అవసరాలు తీర్చే విషయంలో వారి జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే క్రమంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. రైతుల ఆదాయం రెండింతలు కావాలన్నా సామాజిక న్యాయ లక్ష్యాలు నెరవేరాలన్నా అభివృద్ధిలో మహిళల పాత్ర మరింత క్రియాశీలకం కావాలన్నా అందుకు ఐఏఎస్‌లు అనుసరించే విధానాలే కీలకం అవుతుందని ఆయన తెలిపారు. ఈ అధికారులంతా ఇప్పటివరకు తమ తమ విధుల నిర్వహణలో ఎంతో కష్టపడి, నిజాయితీని నిరూపించుకుని ఈ స్థాయికి చేరుకున్నారని రాష్టప్రతి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలకు అంకితభావంతో సేవలు అందించేందుకు ముందుకు సాగాలని వారిని కోరారు.
*చిత్రం..న్యూఢిల్లీలో సోమవారం తనను కలుసుకున్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్