తెలంగాణ

త్వరలో కొత్త రెవెన్యూ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తేనున్నట్టు, పూర్తి స్థాయిలో పారదర్శకంగా, సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో చర్చించి తెచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సోమవారం రాత్రి సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో నియోజక వర్గంలోని 1201 మంది అర్హులైన లబ్ధిదారులకు పాసుపుస్తకాలు, 101 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి హరీష్‌రావు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి సంతకం పెడితే ఇంటికి పట్టాదారు పాస్ పుస్తకం పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. టైటిల్ డీడ్, ఇతరత్రా సమస్యలు లేకుండా సులభతరమైన ప్రజలకు ఆమోదయోగ్యమైన మార్పులు తేనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే పంటకు ఎకరానికి పెట్టుబడి సాయం కింద 5 వేల రూపాయలు రైతుబంధు కింద ఇవ్వనున్నట్టు వెల్లడించారు. చైనా, అమెరికా మనదేశంలో ఆర్థిక మాంద్యంలో ఉన్నామని, అయినప్పటికీ టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజల సంక్షేమ ప్రభుత్వమన్నారు. కేసీఆర్ ఓ వైపు ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కొన్నింట్లో బడ్జెట్ ఖర్చు తక్కువగా చేసినా, పేదలకు సంక్షేమ పథకాలు అందించటంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా రైతులకు రుణమాఫీకి 6 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. నాలుగేళ్లలో 6 వేల కోట్ల చొప్పున రుణమాఫీ చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతుబంధులో ఎకరానికి 10వేల చొప్పున సీఎం కేసీఆర్ ఇస్తున్నట్టుగా, కేంద్రంలో పీఎం నరేంద్రమోదీ కాపీ కొట్టి 6 వేల రూపాయలు ఇస్తున్నారన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. ప్రతి ఇంటి ముందు వేప, తులసి చెట్టు నాటి సంరక్షించాలన్నారు. అదే విధంగా ఇంటింటా తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు